Home

»

Latest News

Sunil: పుష్ప సినిమా వల్లే నా జీవితం ఇలా మారిపోయింది.. సునీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

May 27, 2026 2:17PM

టాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ విలన్ సునీల్ (Sunil) ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలోనే మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా దూసుకుపోతున్నారు. ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన ఆయన, ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్ అంటూ ఇతర భాషల్లోనూ విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా 'కాటాలన్‌' (Kattalan) సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో పాల్గొన్న సునీల్, తన కెరీర్ టర్నింగ్ పాయింట్ గురించి మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' (Pushpa) సినిమా తన జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్పారు.

ప్రస్తుతం తన లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్‌లో నడుస్తోందని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ భాష నుంచి, ఎలాంటి విలక్షణమైన క్యారెక్టర్లు వస్తున్నాయో తనకే తెలియడం లేదని అన్నారు. 'పుష్ప' సినిమాలో మంగళం శ్రీనుగా నటించిన తర్వాతే ఇతర పరిశ్రమల దర్శకులు తనను సరికొత్త కోణంలో చూడటం మొదలుపెట్టారని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన బ్రేక్ వల్లే రజనీకాంత్ 'జైలర్' వంటి పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు వచ్చాయని, కేరళలో షూటింగ్‌కు వెళ్లినా అక్కడి దర్శకులు తనకు మేజర్ రోల్స్ ఇస్తున్నారని సునీల్ పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ 'కట్టాలన్' చిత్రంలో 'మారి' అనే ఒక పవర్‌ఫుల్ తమిళ పాత్రను పోషిస్తున్నట్లు సునీల్ రివీల్ చేశారు. చాలా కాలం తర్వాత తన మనసుకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్ ఇదని ఆయన సంతోషపడ్డారు. ప్రతి నటుడికి సరికొత్త గెటప్‌లో, ఎప్పుడూ చేయని ఒక వైవిధ్యమైన పాత్ర చేయాలనే ఆశ ఉంటుందని, ఈ సినిమాతో తనకు అలాంటి గొప్ప అవకాశం దక్కిందని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా దేవుడి దయ, అలాగే సుకుమార్-అల్లు అర్జున్ ల 'పుష్ప' సినిమా దయ అని సునీల్ కృతజ్ఞతగా చెప్పుకొచ్చారు.

ఒకే రకమైన రొటీన్ పాత్రలు కాకుండా, సరికొత్త క్యారెక్టర్లను బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు అందించే అవకాశం రావడం ఒక నటుడిగా తనకు ఎంతో కిక్ ఇస్తోందని సునీల్ అన్నారు. ఎప్పుడూ చేయని కొత్త పాత్రలు చేసేటప్పుడు మనలో ఒక రకమైన టెన్షన్ ఉంటుందని, ఆ భయంతోనే మరింత కష్టపడి నటిస్తామని, ఆ తర్వాత వచ్చే రిజల్ట్ ఇచ్చే సంతోషమే వేరని సునీల్ పంచుకున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com