.webp)
తెలుగు సినిమా వైభవానికి ప్రతీకగా నిలిచే పలు క్రేజీ సినీ అప్ డేట్స్ సినీ ప్రేమికులని పలకరిస్తున్నాయి.
1 .నందమూరి vs అక్కినేని.. 11 ఏళ్ళ తర్వాత బరిలోకి!
తెలుగు చిత్రసీమలో దశాబ్దాల చరిత్ర కలిగిన నందమూరి, అక్కినేని కుటుంబాల బాక్సాఫీస్ సమరం మరోసారి పునరావృతం కానుంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, కింగ్ నాగార్జున రాబోయే 2027 సంక్రాంతి బరిలో నేరుగా తలపడనున్నారనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. నాగార్జున 100వ చిత్రం 'లాటరీ కింగ్' 'NBK 111' ఇందుకు వేదిక కానున్నాయనేది టాక్. మరి ఇదే కనుక నిజమైతే నందమూరి వర్సెస్ అక్కినేని పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
2 . ధురంధర్ 2 ప్రొడక్షన్ డిజైనర్ పై లైంగిక వేధింపుల కేసు
'ధురంధర్' రెండు భాగాలకి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించిన సైనీ ఎస్. జోహ్రేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు భాగాలకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఒక యువతీ ,సైనీపై పోలీసులకి ఫిర్యాదు చేస్తూ 'గత ఏడాది సెప్టెంబర్ 10 న చండీగఢ్ లోని ఒక హోటల్ కి రావాలని చెప్తే వెళ్ళాక నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను అనారోగ్యంతో ఉన్నా సరే అక్కడ్నుంచి వెళ్లనివ్వలేదు. ఎవరికైనా చెబితే కెరీర్ దెబ్బతింటుందని బెదిరించాడని యువతీ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
3 .వైరల్ గా మారిన ఇరుముడి రిలీజ్ డేట్
మాస్ మహారాజా రవితేజ అప్ కమింగ్ మూవీ 'ఇరుముడి'పై ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. 'ఇరుముడి' రిలీజ్ ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఉంటుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆగస్టు నెలలో ఉండే లాంగ్ వీకెండ్స్, పండుగ సెలవులని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ రిలీజ్ విండోని లాక్ చేయాలని
చూస్తున్నారనేది టాక్. దీంతో రిలీజ్ టైంలో ఇరుముడికి ఎవరు అడ్డు రాకవడమే మంచిదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి
4 . కరుప్పు ఆ స్టార్ హీరోదా!.. వైరల్ అవుతున్న న్యూస్
'కరుప్పు' కొనసాగిస్తున్న వీరవిహారం కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ కరుప్పుని మొదట తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కోసం రాసుకున్నాడని, 2023 ఆగస్టులో విజయ్‌ని కలిసి కథ వినిపించడంతో పాటు కథ వినగానే విజయ్ ఎంతో ఎగ్జైట్ అయ్యారట .మనమే ఈ సినిమా చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. అయితే ఫుల్ స్క్రిప్ట్ కోసం బాలాజీ చాలా టైమ్ తీసుకోవడంతో విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేసాడు. దీంతో బాలాజీ విజయ్ కోసం రాసుకున్న కథతో సూర్యని సంప్రదించారట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
5 . ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. ఆ ఏరియాలో పెద్ది సంచలన రికార్డు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. మూవీ రిలీజ్ కి ముందే ఓవర్సీస్ మార్కెట్లలో 'పెద్ది' క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే నార్త్ అమెరికా, అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న ఈ చిత్రం, తాజాగా యూకే మార్కెట్లో ఊహించని రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. రామ్ చరణ్ గ్లోబల్ పాపులారిటీకి అద్దం పడుతూ యూకే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 12,500 పైగా టిక్కెట్లు అమ్ముడైపోవడం ట్రేడ్ వర్గాలని సైతం విస్మయానికి గురిచేస్తోంది.
6 .మెగాస్టార్‌పై పిచ్చి కూతలు కూస్తే జైలుకే
మెగాస్టార్ చిరంజీవి గురించి అవాస్తవాలని ప్రచారం చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం, ప్రతిష్ట కలిగిన చిరంజీవిపై సదరు ఛానల్ పూర్తిగా బోగస్ కంటెంట్‌తో దుష్ప్రచారం చేస్తోందని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని పోలీసులు నిర్ధారించారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను వాడుతూ ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న ఛానెల్ నిర్వాహకులను శిక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
7 .టాక్సిక్ కొత్త డేట్ ఇదేనా!
రాకింగ్ స్టార్ యష్ మోస్ట్ అవైటెడ్ వన్ మాన్ షో 'టాక్సిక్'.మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కగా ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ ని మార్చుకుంది. వాటిల్లో జూన్ 4 కూడా ఒకటి. ఇప్పుడు ఈ మూవీ ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతుందని, ఆ లోపు ఓటిటి డీల్ పూర్తి కాకపోతే నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే రూమర్స్ వినపడుతున్నాయి
8 .పెద్దిలో హనుమాన్ సీక్వెన్స్
పెద్దికి సినిమాటోగఫీ అందించిన రత్నవేలు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు పెద్దిలోని ఒక సన్నివేశంలో భగవాన్ హనుమంతుడి ప్రస్తావన వస్తుంది . ఆ సీక్వెన్స్ కోసం స్పెషల్ లైటింగ్ డిజైన్ చేశాను. సెల్యులాయిడ్ పై ఆ సీన్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటుకి గురవుతాం. చరణ్ కూడా నిజమైన ఆంజనేయుడిలా కనిపిస్తాడని రత్నవేలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు పెద్ది పై అంచనాలని రెట్టింపు చేసాయి.
9 . నేను బ్లాక్ డ్రెస్ ధరిస్తే జరిగేది ఇదే...త్రిష ఆసక్తికర ట్వీట్
సౌత్ చిత్ర పరిశ్రమలో త్రిషకి ఉన్న స్థానం గురించి తెలిసిందే. ఎన్నో హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా కరుప్పు ఉరఫ్ వీరభద్రుడుతో విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా త్రిష అభిమాని ఒకరు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఎక్స్ వేదికగా విజయ్, అజిత్, సూర్యతో చేసిన గిల్లి, మంగత్తా, ఆరు వంటి చిత్రాల్లో త్రిష బ్లాక్ డ్రెస్ ధరించింది. ఆ చిత్రాలు ఆ హీరోల కెరీర్ కే మైలురాయిగా నిలిచాయి. ఇప్పుడు కరుప్పులో బ్లాక్ డ్రెస్ ధరించింది. సూపర్ హిట్ అయ్యిందని పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ కి త్రిష స్మైల్ ఎమోజి లని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
10 . ఫ్యాన్స్‌కి ఊహించని షాక్.. జూన్ 4న అక్కడ ‘పెద్ది’ రిలీజ్ లేనట్లే!
జూన్ 4న రాబోతున్న ‘పెద్ది’ చిత్రం జపాన్ విడుదలకి బ్రేక్ పడింది. ‘ఆర్ఆర్ఆర్’ తో వచ్చిన క్రేజ్ కారణంగా ఇండియాలో రిలీజ్ రోజే జపాన్‌లోనూ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల జపాన్ విడుదల వాయిదా పడినట్లు డిస్ట్రిబ్యూటర్ సంస్థ ప్రకటించింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో జపాన్‌లోని మెగా అభిమానులు, అక్కడ నివసిస్తున్న భారతీయ సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకి లోనవుతున్నారు.






