Home

»

Latest News

Devara 2: ‘దేవర 2’ ఉందా లేదా?.. అసలు క్లారిటీ ఇదే!

May 03, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ మూవీ భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. అయితే ‘దేవర పార్ట్ 2’ (Devara 2) ఆగిపోయిందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్'తో బిజీగా ఉన్నారు. మరోవైపు కొరటాల కూడా ఇటీవల బాలకృష్ణతో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. దీంతో ‘దేవర 2’ ఇక ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే దేవర సీక్వెల్ నిలిచిపోయిందంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘దేవర 2’ ప్రాజెక్ట్ గురించి నెట్టింట ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో వాస్తవం లేదని, స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బాలయ్య సినిమాను పూర్తి చేసిన తర్వాత కొరటాల ‘దేవర 2’ పనులపై దృష్టి పెట్టనున్నారట. అన్నీ కుదిరితే 2027 ప్రథమార్ధంలో ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. 

పార్ట్ 1 క్లైమాక్స్‌లో వదిలిన చిక్కుముడులను పార్ట్ 2లో మరింత ఇంటెన్సిటీతో చూపించబోతున్నారు. ముఖ్యంగా దేవర, వర పాత్రల మధ్య సంఘర్షణ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం ‘దేవర 2’ ఆగిపోలేదు, ఆలస్యమవుతుంది అంతే. కావున అభిమానులు ఈ సీక్వెల్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com