
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Dragon), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (Dragon) గురించి రోజుకో క్రేజీ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ రాబోతుండగా, అంతకంటే ముందే రెండు సెన్సేషనల్ విషయాలు లీక్ అయ్యాయి.
స్పెషల్ సాంగ్?
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం భారీ పాన్ ఇండియా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కిర్రాక్ పుట్టిస్తున్నాయి. ‘డ్రాగన్’లో కూడా ఒక అదిరిపోయే మాస్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం ఒక స్టార్ హీరోయిన్‌ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. రవి బస్రూర్ అందించే ఊర మాస్ బీట్స్‌కు తారక్ వేసే స్టెప్పులు థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలుస్తోంది.
షర్ట్‌లెస్ ఫైట్!
సినిమాలోని అత్యంత పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఒక లీక్ బయటకు వచ్చింది. ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ షర్ట్‌లెస్(Shirtless)గా కనిపించబోతున్నారట. ఈ ఫైట్ సీక్వెన్స్‌ను ఒక బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత పవర్ ఫుల్ గా చిత్రీకరించనున్నట్లు టాక్. ఇప్పటికే తారక్ తన బాడీని రిప్డ్ లుక్‌లోకి మార్చుకునే పనిలో ఉన్నారని, ఆ ‘బీస్ట్’ అవతారం చూసి ఫ్యాన్స్ షాక్ అవ్వడం గ్యారెంటీ అని అంటున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఆయన మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అంశాలు ఎన్నో ఉండనున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల కానుంది. ఇందులో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.




.webp)

