
మ్యాచో స్టార్ గోపీచంద్ తన 34వ సినిమాను (Gopichand 34) ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ లాంఛనంగా మొదలైంది.
ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్, ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు షాట్ కు దిల్ రాజు దర్శకత్వం వహించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దామోదర ప్రసాద్, రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు.
ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో గోపీచంద్ మునుపెన్నడూ చూడని రీతిలో కనిపించబోతున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఒక చిరుతపులి పర్వతంపై నిలబడి ఉన్న దృశ్యం సినిమాలోని ఇంటెన్సిటీని చాటిచెబుతోంది.
సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా షామ్‌దత్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్స్ గా రామకృష్ణ-మోనిక వ్యవహరిస్తున్నారు.
గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'భరత వర్ష' చిత్రంలో నటిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌తో పాటే ఈ #Gopichand34 షూటింగ్ కూడా సమాంతరంగా జరగనుంది. ఒక యాక్షన్ మాస్టర్ గోపీచంద్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





.webp)
