Home

»

Latest News

నందినీరెడ్డి విడుద‌ల చేసిన‌ ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ పోస్టర్.! 

Oct 16, 2026 6:42PM

కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నందినీ రెడ్డి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’ టైటిల్‌కి తగ్గట్టుగా సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్‌లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారని అర్థం అవుతోంది. టైటిల్‌‌ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా తెలుస్తోంది.  త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు. ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీప్లే- డైలాగ్స్ - దర్శకత్వం - చెందు ముద్దు, నిర్మాత: దినేష్ కుర్ర, బ్యానర్: కుర్ర ప్రొడక్షన్స్, సమర్పణ : కె. రాఘవేంద్ర రెడ్డి, DOP: పంకజ్ తొట్టాడ, ఎడిటర్: డి వెంకట ప్రభు, సంగీతం: మారుతీ రాజా, ప్రాజెక్ట్ ప్రణాళిక & రూపకల్పన: చంద్రహాస్ కోట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్ర బాలాజీ, పబ్లిసిటీ డిజైన్స్: ఎ డిజైన్ ఫ్యాక్టరీ. 

 

 

[destiny movie first look poster, telugu movie destiny, director nandini reddy, jabardast immanuel]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com