Home

»

Latest News

ఆదర్శ కుటుంబం: అసలు ఏమైంది?.. ఇప్పట్లో విడుదల కష్టమేనా.?

Oct 16, 2026 6:56PM

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదల విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. అక్టోబర్ 9న రావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన తర్వాత కొత్త తేదీని ప్రకటించకపోవడంతో.. అసలు ఇప్పట్లో విడుదలవుతుందా అనే చర్చ జరుగుతోంది.

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో తెలిసిందే. ఇప్పుడు తొలిసారి దర్శకుడు, హీరోగా కలిసి పనిచేస్తుండటంతో ‘ఆదర్శ కుటుంబం’పై అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాను మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 9 అన్నారు. కానీ, చివరి నిమిషంలో మెరుగైన అవుట్ పుట్ కోసమంటూ మరోసారి వాయిదా వేశారు. దీంతో దసరా సెలవుల సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే అవకాశాన్ని ఈ సినిమా కోల్పోయింది.

ఇంతవరకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. అక్టోబర్ 30న విడుదలవుతుందని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడంలేదు. 

సాధారణంగా భారీ అంచనాలున్న సినిమాలకు విడుదలకు కొన్ని వారాల ముందే ప్రమోషన్లు మొదలవుతాయి. కానీ ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో మాత్రం అలాంటి హడావిడి కనిపించడం లేదు.

దీంతో సినిమా ఈ నెలాఖరులో వస్తుందా? లేక నవంబర్‌కు వాయిదా పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: చరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు.. బాలీవుడ్ మేకర్స్ కు నో చెబుతున్నారా?

 

 

 

[Aadarsha Kutumbam Release Delay, Aadarsha Kutumbam Release Date, Aadarsha Kutumbam Movie, Venkatesh, Trivikram Srinivas, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com