'రాములో రాములో' తర్వాత.. 'బుట్టబొమ్మ' పాటే!
on May 31, 2020
అల్లు అర్జున్ మూవీ 'అల వైకుంఠపురములో' విడుదలైన తర్వాత కూడా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము దులపగా, తమన్ ట్యూన్స్ ఇచ్చిన ఆ మూవీలోని పాటలు అమిత ఆదరణ సంపాదించుకున్నాయి. మొదట సీతారామశాస్త్రి రచించిన 'సామజవరగమన', తర్వాత కాసర్ల శ్యామ్ రాసిన 'రాములో రాములా' పాటలు బంపర్ హిట్ కాగా, వాటి తర్వాత రామజోగయ్యశాస్త్రి రాసిన 'బుట్టబొమ్మ' సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది.
తాజాగా 'బుట్టబొమ్మ' వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టయి, 200 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇదివరకు ఈ మార్క్‌ను 'రాములో రాములా' సాంగ్ అందుకుంది. ఇప్పటివరకూ ఆ సాంగ్‌కు వచ్చిన వ్యూస్ 271 మిలియన్ వ్యూస్ కావడం విశేషం. అలాగే 'సామజవరగమన' పాట 189 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మిగతా పాటలు 'ఓమైగాడ్ డాడీ', టైటిల్ సాంగ్, 'సిత్తరాల సిరపడు' కూడా బాగానే పాపులర్ అయ్యాయి. మొత్తానికి తమన్ మ్యూజికల్ కెరీర్లో అల వైకుంఠపురములో మూవీ సాంగ్స్ మరపురానివిగా నిలిచాయి.