రానా వెడ్డింగ్ డేట్ వెల్లడైంది!
on May 31, 2020

కొద్ది రోజుల క్రితం రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ నిశ్చితార్ధం (రోకా) జరిగింది. రామానాయుడు స్టూడియోస్‌లో కుటుంబసభ్యుల మధ్య ఉల్లాసంగా జరిగిన ఈ వేడుకలో ఆ ఇద్దరి జంట ఎంత అందంగా ఉందో చూశాం. అప్పట్నుంచీ వాళ్ల పెళ్లి తేదీ ఎప్పుడో తెలుసుకోవాలని రానా ఫ్యాన్స్ ఆసక్తి చూపుతూ వస్తున్నారు. తాజాగా ఆ తేదీని రానా తండ్రి సురేశ్‌బాబు బయటపెట్టారు. ఆగస్ట్ 8న హైదరాబాద్‌లో ఈ వేడుక జరుగుతుందని ఆయన తెలిపారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నియమ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో అతిథులు ఆ వేడుకకు హాజరవుతారని సురేశ్‌బాబు చెప్పారు. ఆయన మాటలను బట్టి కుటుంబ సభ్యులతో పాటు రానా, మిహీకాల స్నేహితులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. రానా, మిహీకా కొంతకాలంగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. అయితే తమ మధ్య బంధాన్ని వాళ్లు బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. "ఆమె సరేనంది" అంటూ సోషల్ మీడియా ద్వారా మిహీకాను రానా పరిచయం చేశాకే.. అందరికీ వాళ్ల ప్రేమ వ్యవహారం తెలిసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



