లింగు స్వామి చేతులెత్తేశాడు.... బోయపాటి ఏం చేయనున్నాడు?
on Jan 10, 2023

హీరో రామ్ పరిస్థితి ఒక సినిమా హిట్ అయితే మూడు సినిమాలు ఫ్లాప్ అన్నట్టుగా సాగుతోంది. ఇటీవల ఆయన ఎంతో నమ్మకంతో చేసిన వారియర్ డిజాస్టర్ గా నమోదయింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. దాంతో రామ్ ఈసారి మరో మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీను తో సినిమా చేయబోతున్నారు. రామ్- బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే. ఈ మధ్యకాలంలో తన కెరీర్‌లో రామ్ తెలుగులోని స్టార్ డైరెక్టర్ తో చేస్తున్న సినిమా ఇదే అని కూడా చెప్పవచ్చు. రామ్- బోయపాటి కలయికలో ఈ సినిమా ఊరమాస్‌గా రాబోతోంది. దీనికోసం రామ్ తన లుక్కు మొత్తం మార్చేశారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ ఉన్నందున ఇందులో రామ్ గురించిన లేటెస్ట్ న్యూస్ ఆయన ఫ్యాన్స్ ను ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. సినిమాలో రామ్ పాత్రలో చాలా ట్విస్టులు ఉంటాయట. హీరో పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి అంటున్నారు.
ఈమధ్య పాన్ ఇండియా సినిమాలుగా పేరు తెచ్చుకున్న సినిమాలలో కథ ఎలా ఉన్నా కూడా హీరో యాటిట్యూడ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆ హీరోయిజమే ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ క్రమంలోనే బోయపాటి శీను కూడా రామ్ పాత్రను చాలా బలంగా రాసుకున్నారట. ఈ పాత్రలోని వేరియేషన్స్ ని సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తాయని అంటున్నారు. ఈ సినిమా రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ధమాకా తో సూపర్ హిట్ అందుకున్న ఈమె రామ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. బోయపాటి డైరెక్షన్లో సినిమా అంటే హీరో రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానికి తగ్గట్టుగా రామ్ కూడా వర్కౌట్స్ చేస్తున్నారట. రామ్ తో బోయపాటి సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు పండగే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కే పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి రామ్‌కు అంతకుమించిన సూపర్ డూపర్ హిట్ ఇస్తాడని అందరూ ఆశిస్తున్నారు.
ఈ విషయంలో అందరికీ మంచి నమ్మకాలు ఉన్నాయి. ఇదే నమ్మకం సినీ జనాలలో కూడా ఉంది. అఖండ వంటి మూవీ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. తదుపరి బోయపాటి -రామ్ సినిమా అనంతరం మరోసారి బాలయ్య బోయపాటి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో బోయపాటి-రామ్‌ల సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. బాలయ్యతో సినిమాకి ముందు బోయపాటి రామ్ లాంటి యంగ్ హీరోతో చేసే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. దీనికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడట. ఇప్పటికే ఉత్తరాదిలో రామ్ సినిమాలు యూట్యూబ్ ల ద్వారా బాగా ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఇక్కడ సరిగా ఆడని చిత్రాలను కూడా ఉత్తరాది ప్రేక్షకులు యూట్యూబ్ లలో బాగా ఆదరించారు. దానికి ఆయా చిత్రాలకు వస్తున్న వ్యూసే నిదర్శనం. ఇక ఈ సినిమా విషయంలో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేస్తున్నారట. ఈ కాంబోలో కరెక్ట్ సినిమా వస్తే మాత్రం రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. మరి రామ్- బోయపాటి కలిసి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచిచూడాల్సి వుంది....!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



