'గూఢచారి-2' కోసం అడివి శేష్ సిక్స్ ప్యాక్!
on Jan 10, 2023

తెలుగు హీరోలలో అల్లు అర్జున్, ప్రభాస్, రానా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఇలా ఎందరో సిక్స్ ప్యాక్ తో అలరించారు. ఇప్పుడు ఆ లిస్టులో మరో హీరో చేరబోతున్నాడు. 'గూఢచారి-2'లో అడివి శేష్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు.
అడివి శేష్ సూపర్ హిట్ ఫిల్మ్ 'గూఢచారి'(2018)కి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ మూవీ ప్రీ విజన్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ.. "ఈ ఫ్రాంచైజ్ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలనే తపనతో చేస్తున్నాం. జీ2(గూఢచారి-2) మరో స్థాయిలో ఉంటుంది. కొన్ని నెలల పాటు స్క్రిప్ట్ మీద వర్క్ చేసి, ఆ తర్వాత షూటింగ్ కి వెళ్తాం. అలాగే మా దర్శకుడు వినయ్ కోరుకున్నట్లు ఈలోపు నేను సిక్స్ ప్యాక్ చేయాలి. అసలు మేం ఈ సినిమాని ఎలా తీయబోతున్నామని చూపించడం కోసమే ఈ ప్రీ విజన్ వీడియో రిలీజ్ చేశాం. ఈ సినిమాని ఇండియా సహా మొత్తం ఐదు దేశాల్లో షూట్ చేయబోతున్నాం. ఏడాదిన్నరలో ఈ సినిమాని పూర్తి చేస్తాం. 2024లో జీ2 బాక్సాఫీస్ ని రాక్ చేస్తుందని నమ్ముతున్నాం" అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



