'గూఢచారి-2'కి అందుకే డైరెక్టర్ మారిపోయాడు!
on Jan 10, 2023

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన సినిమా 'గూఢచారి'. 2018లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. అయితే ఈ సీక్వెల్ కి శశి కిరణ్ బదులుగా.. 'గూఢచారి' అసోసియేట్ ఎడిటర్, 'మేజర్' ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీది దర్శకత్వం వహించనుండటం ఆసక్తికరంగా మారింది. 'గూఢచారి-2'కి దర్శకుడు ఎందుకు మారిపోయాడో తాజాగా శశి కిరణ్ రివీల్ చేశాడు.
'గూఢచారి-2' ప్రీ విజన్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శశి కిరణ్ మాట్లాడుతూ.. "గూఢచారి-2 ప్రకటన వచ్చినప్పటి నుంచి నువ్వు ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు అంటూ అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. దీని వెనక చిన్న కథ ఉంది. మేజర్ మూవీ 40 శాతం షూటింగ్ జరిగాక ఫస్ట్ లాక్ డౌన్ వచ్చింది. ఆ సమయంలో మేం మేజర్ గురించి, మేజర్ ఎడిటింగ్ తరుచూ మాట్లాడుకునేవాళ్ళం. ఒకసారి శేష్ కాల్ చేసి జీ2(గూఢచారి-2) స్టొరీకి ఒక ఐడియా వచ్చిందని చెప్పగానే.. విని చాలా బాగుంది అన్నాను. అప్పుడు ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ వినయ్ అయితే బాగుంటుందని మేమిద్దరం అనుకున్నాం. ఎందుకంటే గూఢచారి షూటింగ్ టైంలో మాకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే వినయ్ ని అడిగేవాళ్ళం. గూఢచారి యూనివర్స్ పై అతనికి చాలా అవగాహన ఉంది. గూఢచారి సిరీస్ కి అతను పర్ఫెక్ట్ అని మేం నమ్మి అతన్ని ఎంపిక చేసుకున్నాం." అని తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



