Home

»

Latest News

డబుల్ ధమాకా: ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో ఆ ఇద్దరు స్టార్స్.!

Sep 4, 2026 10:30AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్'పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఎన్టీఆర్ భుజానికి చిన్న గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చారు మేకర్స్. త్వరలోనే తారక్ కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గ్యాప్‌లోనే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కీ రోల్స్‌లో కనిపించబోతున్నారట.

ఆలియా భట్, ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. అందులో సీతగా ఆలియా, భీమ్‌గా తారక్ తమ యాక్టింగ్‌తో గూస్‌బంప్స్ తెప్పించారు. ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్న ఈ డార్క్ అండ్ రా యాక్షన్ వరల్డ్‌లో ఆలియా ఒక క్రూషియల్ రోల్ చేయబోతోందనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక షాహిద్ కపూర్ పేరు వినిపించడం మరో సర్ ప్రైజ్. ‘కబీర్ సింగ్’ లాంటి ఇంటెన్స్ రోల్స్‌లో అదరగొట్టిన షాహిద్ కపూర్‌ను ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో స్క్రీన్ మీద చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ. అసలు షాహిద్ కపూర్ పాత్ర ఏంటి? ఎన్టీఆర్‌ని ఢీ కొట్టే పవర్ ఫుల్ నెగటివ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారా? అనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ యాక్టర్ బిజు మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడు ఆలియా భట్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా తోడైతే, ‘డ్రాగన్’ రేంజ్ మరో లెవెల్‌కి వెళ్లడం ఖాయం.

 

 

 

[Jr NTR, Prashanth Neel, Dragon Movie, Alia Bhatt, Shahid Kapoor, NTR Dragon Cast, Telugu Film News, Telugu News, Tollywood]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com