ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై బాలకృష్ణ ఏమన్నారంటే?
on Jun 1, 2020
సాక్షాత్తూ స్వర్గీయ నందమూరి తారకరామారావు రూపురేఖలతో జన్మించిన మనవడు, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పూర్తిస్థాయిలో ఎప్పుడు చేరతారు? అటు నందమూరి, ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. తెలుగు ప్రజలు దేవుడిగా కొలిచే వ్యక్తి, ‘అన్నగారు’ అని ఆత్మీయంగా పిలుచుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు హరికృష్ణ రథసారథిగా ఉన్నారు. అందువల్ల, హరికృష్ణ కుమారుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే అభిమానులకు ఆనందమే కదా! జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం తరఫున ప్రచారం నిర్వహించారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు తాజా ఇంటర్వ్యూలో ‘జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి పూర్తిస్థాయిలోకి వస్తే అటు తెలంగాణలో గానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో గానీ పూర్వ వైభవం వస్తుందనేది ఉంది’ అని అభిప్రాయం ఎదురైంది.
‘‘మీరు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు. సినిమా యాక్టర్‌గా తనకి (జూనియర్ ఎన్టీఆర్‌కి) చాలా భవిష్యత్తు ఉంది. ఫ్రొఫెషన్ వదులుకుని రమ్మని అడగలేం కదా! నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సినిమాలు చేస్తున్నాను. నాన్నగారు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలోనూ సినిమాలు చేశారు. అందువల్ల, అది వాళ్ల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది’’ అని బాలకృష్ణ అన్నారు. ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయాన్ని ఆయన ఎన్టీఆర్‌కి వదిలారు అన్నామాట.
Also Read