చంద్రబాబు అయితే కరోనా సమస్యను హ్యాండిల్ చేసేవారు!
on Jun 1, 2020
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగదని హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి పునరుద్ఘాటించారు. ఇటీవల జరిగిన మహానాడులోనూ ఆయన ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఉండదో ఆయన తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోయాయి. జనంమీద దాడులు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. ఆ రోజుల్లో హుద్‌హుద్ వచ్చింది. చంద్రబాబునాయుడు గారు వైజాగ్‌లో రెండు వారాల పాటు ఉండి, చక్కగా డీల్ చేశారు. అది ప్రకృతి వైపరీత్యం. ఇప్పుడు కరోనా వచ్చింది. ఇదొక జబ్బు. దీన్ని కూడా ఆయన (చంద్రబాబు) హ్యాండిల్ చేసేవారేమో" అని ఆయన అన్నారు.
అప్పుడు, ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉందో జనం కంపేర్ చేసుకుంటున్నారని బాలకృష్ణ చెప్పారు. "ఇటీవలే వైజాగ్‌లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకవడం, హెచ్‌పీసీఎల్‌లో దట్టంగా పొగ కమ్ముకోవడం చూశాం. వీటన్నింటినీ జనం చూస్తున్నారు" అని ఆయనన్నారు. ఆంధ్రాలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ రావడం ఖాయమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
