కరణం మల్లేశ్వరి బయోపిక్‌కు రంగం సిద్ధం
on Jun 1, 2020
.jpg)
ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కతమవుతున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించి, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసిన కరణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్కరించనున్నారు.
ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కోన ఫిల్మకార్పొరేషన్ బ్యానర్స్‌పై ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించే ఈ బయోపిక్‌కు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కోనవెంకట్ ఈ చిత్రానికి రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.
సంజనారెడ్డి ఇదివరకు రాజ్ తరుణ్ హీరోగా రాజుగాడు మూవీని డైరెక్ట్ చేశారు. అది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. కొంతకాలంగా ఆమె కరణం మల్లీశ్వరి బయోపిక్ తీయాలనే ఉద్దేశంతో ఆమె జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



