Home

»

Latest News

'ఆదర్శ కుటుంబం' టీజర్: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో.. నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం.!

Sep 11, 2026 6:02PM

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47'. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్, వెంకీ మామ మార్క్ టైమింగ్ ఏ స్థాయిలో పేలాయో తెలిసిందే. ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమాలు వస్తే నవ్వుకుంటూనే ఉంటాం. అయితే అప్పట్లో కేవలం రైటర్‌గా మాత్రమే సంచలనం సృష్టించిన త్రివిక్రమ్, ఇప్పుడు మొదటిసారి వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. 'ఆదర్శ కుటుంబం' ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుంచే సరికొత్త వైబ్ మొదలైంది.

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆదర్శ కుటుంబం' బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ అఫీషియల్ టీజర్‌ను రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "The ENTERTAINMENT levels are about to LEVEL UP!" అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో వెంకటేష్ సైలెన్స్ వెనుక పెద్ద తుఫానే ఉన్నట్టుగా అనిపిస్తోంది.

ఈ సినిమాలో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించబోతుండడం విశేషం!. వీరితో పాటు నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

 

 

Aadarsha Kutumbam Teaser, AK47 Teaser, Venkatesh, Trivikram, Srinidhi Shetty, Nara Rohith, Telugu Film News, Telugu News

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com