Home

»

Latest News

ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య

Feb 24, 2026

 

 

సంచలనం సృష్టిస్తున్న హత్య 
టూరిస్టులుగా వచ్చి దారుణానికి పాల్పడిన వైనం 
శోక సంద్రంలో విష్ణుప్రియ కుటుంబసభ్యులు 
చంపిన ఆ ఐదుగురు ఎవరు!

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజులతో పాటు, తెలియని వ్యక్తుల విషయంలో ఎవర్ని నమ్మాలో,నమ్మకూడదో కూడా అర్ధం కానీ పరిస్థితి. దీంతో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో బాధిత కుటుంబసభ్యులు శోక సంద్రంలో ఉండాల్సిన పరిస్థితి. ప్రముఖ నటి విష్ణుప్రియ(Vishnu Priya)ప్రస్తుతం ఆ పరిస్థితినే ఎదుర్కొంటుంది. 

విష్ణుప్రియ తండ్రి పేరు సూర్య నారాయణ(Suryanarayana). తమిళనాడులోని కొడైకెనాల్(Kodaikenal)సమీపంలో ఉన్న ఆండవర్ కోయిల్ ఏరియాలో నివసిస్తూ ఉంటాడు. గత శనివారం ఐదుగురు వ్యక్తులు  విహారయాత్ర కోసం వచ్చి సూర్యనారాయణ నివాసముంటున్న దగ్గరలోనే రూమ్ తీసుకున్నారు. అదే రోజు రాత్రి సదరు ఐదుగురు వ్యక్తులు సూర్యనారాయణ ఉంటున్న ఇంటికి వచ్చి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి, అనంతరం ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న ఉంగరం తీసుకొని వెళ్లిపోయారు. సిసి టీవీ ఫుటేజ్ ని కూడా తీసుకెళ్లడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

aslo read: Manchu Manoj: మంచు మనోజ్ మంచి మనసు.. పునర్విక కోసం రంగంలోకి 

2018 లో విష్ణుప్రియ ప్రేమించిన వ్యక్తి హత్యకి గురయ్యాడు. ఆ హత్యకి, ఇప్పటి సూర్యనారాయణ హత్యకి ఏమైనా సంబంధం ఉందేమో అనే అనుమానాలు మొదలవ్వడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2005 లో సూర్య, జ్యోతిక జంటగా వచ్చిన మాయావి లోని సిగప్పి క్యారక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత అనేక తమిళ చిత్రాల్లో చేసి మంచి పేరు సంపాదించింది.

 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com