Home

»

Latest News

Manchu Manoj: మంచు మనోజ్ మంచి మనసు.. పునర్విక కోసం రంగంలోకి 

Feb 24, 2026


--పునర్విక కోసం రెండు తెలుగు రాష్టాల ప్రజల ప్రార్థనలు 
తోచిన సాయం కూడా చేస్తున్నారు 
-ఈ విషయంలో మంచు మనోజ్ అభినందనలు 
-ఒక్క ఇంజక్షన్ 16 కోట్ల రూపాయలు
 


ఊహ తెలియని పసిపిల్లలు దైవంతో సమానమని అంటారు. అందరూ ఆ దశ దాటి వచ్చిన వాళ్ళమే. అందుకే మన పిల్లలతో పాటు వేరే వాళ్ళ పిల్లలని చూసినప్పుడు ఆనందంతో వాళ్ళ బుగ్గలని స్పృశించకుండా ఉండలేం.అదే టైంలో హెల్త్ పరంగా వారికి ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే ఎంతగానో తల్లడిల్లిపోతాం.ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంవత్సరం కూడా నిండని కర్నూల్(Kurnool)జిల్లాకి చెందిన పునర్విక(Punarvika)విషయంలో అదే విధంగా తల్లడిల్లిపోతు తమకి చేతనైన సాయం చేస్తున్నారు.ఈ విషయంపై మంచు మనోజ్ స్పందిస్తు మరిన్ని సూచనలు చేసాడు. ఆ వివరాలేంటో చూద్దాం

ఎక్స్ వేదికగా స్పందిస్తు 'పునర్విక విషయం తెలిసి నా హృదయం ముక్కలైంది. తెలుగు రాష్టాల యువత మొత్తం పాప కోసం ఫండ్ కలెక్ట్ చేయడం అభినందనీయం.పునర్విక పరిస్థితి బాగాలేదు. ఆమెని కలవడానికి ఎవరు ప్రయతించవద్దు. చిన్నారి ప్రాణాలు కాపాడగలిగితే పాప కుటుంబంతో పాటు అందరం గెలిచినట్టే అని తెలిపాడు.పునర్వక కి సాయం అందించాలంటూ  పిఏంవో,తెలుగు రాష్ట్రాల సిఏం లకి కూడా ట్యాగ్  చేసారు.

also read: Ram charan: రామ్ చరణ్ కి అండగా అల్లు శిరీష్.. ట్రోల్ల్స్ ఆగాయా!

పునర్విక ఆరోగ్య విషయానికి వస్తే స్పైనల్ మస్యులర్ ఆట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. సదరు వ్యాధి నయం కావడానికి 16 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజక్షన్ కావాలి. ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల రూపాయలు కలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్విక ఆరోగ్య బాధ్యతలు తీసుకోబోతునట్టుగా వార్తలు వస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com