Home

»

Latest News

25 కోట్లు ఇచ్చినా ఆ యంగ్ హీరోకి సినిమా చేసేంత టైమ్ లేదు!

Feb 24, 2026

హీరో అంటే ఆరడుగుల ఎత్తు ఉండాలి. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. సాధారణంగా ఇవీ ఒక సినిమా హీరోకి ఉండాల్సిన అర్హతలు. కానీ, మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలన్నా, హీరోగా నిలబడాలన్నా అవేవీ అక్కర్లేదని, కేవలం టాలెంట్ ఉంటే సరిపోతుందని ఎంతో మంది హీరోలు ఇప్పటికే ప్రూవ్ చేశారు. అలా ఇప్ప్పుడు మరో హీరో తమిళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. అతనే ప్రదీప్ రంగనాథన్. 

ప్రదీప్ హీరో మాత్రమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైలాగ్ రైటర్, లిరిక్ రైటర్, సింగర్.. ఇలా బహుముఖంగా తన ప్రజ్ఞను ప్రదర్శిస్తున్న టాలెంటెడ్ పర్సన్. 2019లో రవిమోహన్ హీరోగా తమిళ్‌లో వచ్చిన ‘కోమలి’ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు ప్రదీప్. అంతకుముందు ప్రదీప్ కొన్ని షార్ట్ ఫిలింస్ రూపొందించాడు. వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదీప్ డైరెక్ట్ చేసిన కొన్ని షార్ట్ ఫిలింస్‌ని చూసి ఇంప్రెస్ అయిన రవిమోహన్ అతనికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. అలా మొదలైన ప్రదీప్ కెరీర్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయింది. 

2022లో తనే హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘లవ్ టుడే’ చాలా పెద్ద హిట్ అయింది. తను అంతకుముందు చేసిన షార్ట్ ఫిలిం కథాంశంతోనే లవ్ టుడే చిత్రాన్ని రూపొందించాడు. ఆ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చి ఆ తర్వాత డ్రాగన్, డ్యూడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరో అయిపోయాడు. హీరోగా తనకంటూ ఒక స్ట‌యిల్‌ని క్రియేట్ చేసుకున్న ప్రదీప్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతను హీరోగా చేసిన సినిమాలు తెలుగులోనూ పెద్ద విజయం సాధించాయి. తమిళ ఇండస్ట్రీలో ప్రదీప్ అంటే మరో ధనుష్ అనే పేరు తెచ్చుకున్నాడు. 

ప్రస్తుతం తమిళ్‌లో ఎక్కువ బిజీగా ఉన్న యంగ్ హీరో ప్రదీపే. అతనితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. దానికి తగ్గట్టుగానే తన రెమ్యునరేషన్‌ని పెంచి సినిమాకి పాతిక కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అయినా అతనితో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ 8 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. అందులో పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ప్రదీప్‌కి మంచి డిమాండ్ ఉంది. అందుకే అతను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ, ప్రదీప్‌కి ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సినిమా చేసేంత టైమ్ అతనికి లేదు. ఇటీవలికాలంలో ఇంత డిమాండ్ ఏర్పడిన యంగ్ హీరో ప్రదీప్ తప్ప మరొకరు కనిపించడం లేదు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com