
-సోషల్ మీడియాలో హల్ చేస్తున్న వ్యాఖ్యలు
-సోనా హైడెన్ దైర్యం ఏంటి
-ఆమె వ్యాఖ్యలు సరైనవేనా!
సోనా హైడెన్(Sona Heiden).. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందింది.ప్రెజెంట్ ఆమె పేరు,రూపు మనకి కొత్తగా అనిపిస్తూ ఉండవచ్చు కానీ సినిమాల లిస్ట్ చెప్తే తెలుగు సినిమా ప్రేమికులు అవును కదా మాకు తెలుసు అని ఖచ్చితంగా అంటారు. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),పూరి కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా'తో పాటు ఆయుధం, వీడే, విలన్ వంటి చిత్రాల్లో చేసింది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో అయితే లెక్క పెట్టడానికి అలుపు వచ్చేంత సినిమాల్లో చేసింది. కాకపోతే కండిషన్ అప్లై అనే రీతిలో శృంగార తరహా క్యారెక్టర్స్ మాత్రమే ఆమెని పలకరించడంతో బోల్డ్ నటి అనే ముద్ర పడింది. కానీ అది కూడా నటనలో ఒక భాగమే అనుకోండి. ప్రెజెంట్ దర్శకురాలిగా మరి 'స్మోక్' అనే వెబ్ సిరీస్ ని నిర్మిస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలతో సోనా హైడెన్ కి సంబంధించిన పాస్టెన్స్ లోకి కూడా వెళ్లాల్సి వచ్చింది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
స్మోక్ ప్రమోషన్స్ లో ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదనే విషయంపై మాట్లాడుతు 'ఇండస్ట్రీలో గ్లామర్, శృంగార నటిగా పాపులారిటీ వచ్చింది. దీంతో ఆ ఇమేజ్ మ్యారేజ్ లైఫ్‌కి అడ్డం పడే అంశంగా మారింది. అయినా సాధారణ యువతిని అయితే వంట చెయ్యడంతో పాటు ఇంటిని చక్కబెట్టే పొజిషన్ లో ఉండే దాన్ని. కానీ ఆ పనులు నేను చేయలేను. నా ఇమేజ్ ని చెరిపి వేసుకోవడానికి సీరియల్స్‌లో తల్లి క్యారెక్టర్స్ కోసం ప్రయత్నించాను. అవకాశాలు రాలేదు. అందుకే యాక్టింగ్‌కి బ్రేక్ తీసుకున్నాను. కానీ సినిమా నన్ను మళ్లీ వెనక్కి లాగేసింది. దాంతో స్మోక్ తో దర్శకురాలిగా మారానని చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా అమ్ముల పొదిలో దాగి ఉన్న ఆమె గత వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి. మరి అవి కూడా చూసేద్దాం.
also read: Rashmika Mandanna: రష్మికపై జరుగుతున్న అసత్య ప్రచారం ఇదే.. విజయ్ దేవరకొండ స్పందన చూడాలి.
ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'వైవాహిక వ్యవస్థపై నమ్మకం లేదు. మగాళ్లంటే నాకు టిష్యూ పేపర్‌తో సమానం. వాళ్ళతో కలిసి జీవించడం పెద్ద ఫూలీష్ అని మాట్లాడింది. దీంతో తమిళనాడులోని వెల్లూరులో కేసు నమోదు కావడంతో పాటు సదరు కేసులో కోర్టుకి హాజరైన రికార్డు సోనా హైడెన్ సొంతం.







