Home

»

Latest News

Manchu Manoj: సాకులు చెప్పొద్దు.. ఫేక్ చేయొద్దు.. మంచు మనోజ్ సంచలనం!

Mar 13, 2026

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) తన తదుపరి సినిమా 'డేవిడ్ రెడ్డి'(David Reddy) కోసం సిద్ధమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనకాడని మనోజ్, తాజాగా తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపాడు.

గత మూడు వారాలుగా కఠినమైన శిక్షణలో ఉన్న మనోజ్, తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "మూడు వారాల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాను. కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలని, సాకులు చెప్పడం ఆపి కష్టపడాలని నిశ్చయించుకున్నాను" అన్నాడు. 

కేవలం బాడీ బిల్డింగ్ కోసం కాకుండా, యాక్షన్ సీక్వెన్స్‌లలో పర్ఫెక్షన్ కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. "యాక్షన్ సినిమాల్లో మన బదులు ఇంకెవరూ ఫేక్ చేయలేరు. ప్రతి పంచ్, ప్రతి దెబ్బ కెమెరా ముందు నిజాయితీగా కనిపించాలి. అందుకే నా శరీరాన్ని 'అన్‌బ్రేక్ బుల్'గా మార్చుకుంటున్నాను." అని మనోజ్ రాసుకొచ్చాడు.

ఇటీవల తేజ సజ్జతో కలిసి నటించిన 'మిరాయ్' సినిమాలో బ్లాక్ స్వోర్డ్ పాత్రలో మనోజ్ చూపిన విలనిజం ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు తన తదుపరి చిత్రం 'డేవిడ్ రెడ్డి'పై మనోజ్ మరింత దృష్టి సారించాడు.

హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1897 నుండి 1920 మధ్య కాలంలో బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడి కథ ఇది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి సినిమాపై అంచనాలను పెంచింది. రియాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com