
ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ గ్యాస్, చమురు సంక్షోభం వచ్చేసింది. వండుకోవడానికి గ్యాస్ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఐతే గ్యాస్ లేకుండా కూడా వంట చేసుకోవచ్చు అంటూ హీరో నాగార్జున ఎప్పుడో చెప్పారు. అదేంటి అనుకుంటున్నారా నిజం. "నేనున్నాను" అనే మూవీ గుర్తుందా. అందులో ఒక సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. శ్రేయ - నాగార్జున కలిసి వంటగదిలో వంట చేస్తూ ఉంటారు. అంతలో గ్యాస్ ఐపోయింది అంటూ శ్రేయ చెప్తుంది. ఇంతలో నాగార్జున ఒక కొత్త టెక్నీక్ ని కనిపెట్టి శ్రేయని ఇంప్రెస్స్ చేస్తాడు.

అదేంటంటే ఇస్త్రీ పెట్టె వేడెక్కాక దాని మీద చిట్టి దోస వేసి "అను రా దోస రెడీ " అని పిలుస్తాడు. "ఐరన్ బాక్స్ మీద దోసెలా " అంటూ ఉప్పొంగిపోతుంది. ఆ సీన్ ని హీరో నవదీప్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసి "22 ఏళ్ళ క్రితమే నాగార్జున గారు చెప్పారు గ్యాస్ లేకపోతే ఐరన్ బాక్స్ మీద దోశలు వేసుకోమని" అంటూ రాసాడు. ఇప్పుడు ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు నాగార్జున ఇన్స్పిరేషన్ తో ఎంతమంది ఎన్ని కొత్త టెక్నీక్స్ కనిపెడతారో చూడాలి. గ్యాస్ కొరత కారణంగా ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ లు కొంటున్నారు కానీ అప్పుడు అవి లేవు. ఇక ఇప్పుడు కొంతమంది కట్టెల పొయ్యలు కిరోసిన్ స్టవ్ ల దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు.







