Home

»

Latest News

Dhurandhar 2: ధురంధర్ 2 విసుగు పుట్టించే సినిమా.. మీ డబ్బు వృధా చేసుకోవద్దు

Mar 21, 2026

 

 

-పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్ 2 
-కానీ రమ్య ఇచ్చిన రివ్యూ వైరల్ 
-తన రివ్యూలో ఏముంది 


మనుషులే అందరకి అందరు నచ్చరు. అలాంటిది సినిమాలది ఏముంది చెప్పండి. నచ్చే వాళ్లకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. కానీ అంతిమంగా మెజారిటీ ప్రేక్షకుల మౌత్ టాక్ నే ప్రధానం. అనాదిగా వస్తున్న ఆ మెజారిటీ ప్రేక్షకుల నిర్ణయానికే బాక్స్ ఆఫ్ ఆఫీస్ తలవంచి రికార్డు కలెక్షన్స్ ని అందచేస్తుంది. ఈ క్రమంలోనే  రీసెంట్ గా విడుదలైన ధురంధర్ 2 కి మెజారిటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ బజ్ వస్తుండటంతో కలెక్షన్స్ ఏ మేర వస్తాయనే ఆత్రుతతో అందరు ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ టైం లో అసలు ధురంధర్ 2 బాగోలేదు.వేస్ట్ సినిమా అని  ప్రముఖ నటి రమ్య చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఆమె పోస్ట్ లో ఏముందో ఒకసారి చూద్దాం.

ఎక్స్ వేదికగా రమ్య(Ramya)స్పందిస్తు 'ఇప్పుడే ధురందర్ 2(Dhurandhar 2)చూశాను, వావ్! ఆశాజనకంగా ఉన్న మూవీని సహనపరీక్షగా ఎలా మార్చవచ్చో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ధురంధర్ 2 చూస్తున్నంత సేపు అంతులేని అధ్యాయాలతో ఉన్న అత్యంత విసుగు పుట్టించే పాఠ్యపుస్తకాన్ని చదివినట్లుగా ఉంది. ఒకానొక దశలో, మీ కళ్ల ముందు జరుగుతున్న అఘాయిత్యాన్ని చూసి, మీ మెదడు ఇక ఏమీ చేయలేక నిరాశతో నవ్వడం మొదలుపెడుతుంది. మీరు నిజంగా ఈ సినిమా చూడాలనుకుంటే, దయచేసి థియేటర్‌లో మీ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోకండి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చూస్తేనే ఉత్తమంగా ఉంటుంది. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ నాసిరకంగానే ఉన్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు పడకుండానే   హడావిడిగా సినిమాని రిలీజ్ చేశారేమో అనిపిస్తుంది. ధురందర్ పార్ట్ 1లో జనం కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ, ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక ఎనర్జీ ఉంది. ప్రేక్షకులు అందులో లీనమయ్యారు.

పార్ట్ 2 లో మాత్రం  ఆడియన్స్ దేన్నీ పట్టించుకోలేదు. థియేటర్‌లో ఉన్న వారందరి సామూహిక నిరాశని మీరు స్పష్టంగా చూసి  అనుభూతి చెందవచ్చు. మూవీ మొత్తాన్ని రణ్‌వీర్ మోస్తున్నాడని చెప్పే ప్రతి ఒక్కరికీ-అసలు అతను ఏమి మోస్తున్నాడు? ఎందుకంటే నాకు కనిపించిందల్లా అతని జుట్టే. మొదటి భాగంలో, అతని జుట్టుకు ఒక వ్యక్తిత్వం, ఆకర్షణ, ఒక ప్రత్యేకత ఉండేవి. ఈ భాగంలో, అది ఊరికే ఉంది. సన్నివేశాలని బ్లాక్ చేస్తూ ప్రతీదానికి అడ్డుగా ఉంది. బహుశా సహాయ నటుడి నామినేషన్‌కు అర్హమైనదేమో.  ఇక ఆ హింస. ఇది ఒక సినిమా కాదు, ఇది ప్రాథమికంగా చుట్టూ పడి ఉన్న ఏ వస్తువుతోనైనా ఎంత సృజనాత్మకంగా హింసను సృష్టించవచ్చో చూపించే ఒక దృశ్య మార్గదర్శి. సిరంజి వాడారు. స్పానర్ వాడారు.

కత్తులు, ముళ్ల బంతులు, కొడవళ్లు, గొలుసులు, తుపాకులు, బాంబులు, బాజూకాలు, షట్టర్లు - మీరు ఏది చెప్పినా, దాన్ని ఆయుధంగా మార్చేశారు. గత సన్నివేశం కంటే తర్వాతి సన్నివేశాన్ని మరింత హింసాత్మకంగా హాస్యభరితంగా ఎలా చేయాలి? అని దర్శకుడు తనతో తానే నిరంతరం పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. అది షాకింగ్‌గా ఉండటం మానేసి, నవ్వు తెప్పించే స్థాయికి చేరుకుంటూనే ఉంటుంది''

also read: Dhurandhar 2: ధురంధర్ 2 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. శంకర్ డైరెక్ట్ చేసే ఎలా ఉండేదో!
మీరు రెండు కాళ్ళూ నరికేసి, మొండెం మీద కిరోసిన్ పోసినా కూడా, ఆ వ్యక్తి ఏదో టెడ్ టాక్ మధ్యలో ఉన్నట్టుగా డైలాగులు చెబుతూనే ఉన్నాడు. మెడికల్ సైన్స్ జిందాబాద్. ఆస్కార్ సంగతి మర్చిపోండి, నోబెల్ బహుమతి రాబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ధురందర్ 2 ఒక పెద్ద నిరాశపరిచే సినిమా. ఇది ఒక బోరింగ్ కామెడీ. మొదటి భాగం మిమ్మల్ని నవ్వించి ఉంటే, ఈ భాగం చూశాక 'ధురందర్ 2 ఎందుకు?' అని ప్రశ్నించుకుంటారు. రణ్‌వీర్, నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. మీ మితిమీరిన జాతీయవాదం, ప్రొపగాండా పాతబడిపోయాయి. వాటి నుంచి బయటకు రండి'' అని ప్రియ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ సుదీర్ఘ పోస్ట్  ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. 

కన్నడ చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగిన రమ్య  కర్ణాటకలోని మాండ్య పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీ గా ప్రాతినిధ్యం వహించింది. తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యు అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. ఈ ఏడాది జనవరిలో ఉపేంద్రతో కలిసి రక్త్ బ్రహ్మాండ్ లో చేసింది. 

  ?s=20

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com