Home

»

Latest News

Dhurandhar 2: ధురంధర్ 2 పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. వారణాసి వస్తుంది కదా మర్చిపోరులే 

Mar 21, 2026

 

 

-ధురంధర్ 2 ని చూసిన రాజమౌళి 
-నచ్చిందా! నచ్చలేదా!
-రాజమౌళి రివ్యూలో ఏముంది 


ధురంధర్ 2(Dhurandhar 2).. ఇప్పుడు ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా ఇదే సౌండ్ సర్క్యులేట్ అవుతూ వస్తుంది. పైగా ఈ రోజు నుంచి తెలుగు వెర్షన్ థియేటర్స్ లో ప్రత్యక్షమవ్వడంతో థియేటర్స్ అన్ని ధురంధర్ తెలుగు ఫ్యాన్స్ తో ఫుల్ రష్ గా ఉన్నాయి. ఇక పార్ట్ 2 గురించి ఎన్టీఆర్(Ntr),అల్లు అర్జున్(Allu Arjun),మహేష్ బాబు(Mahesh Babu)వంటి స్టార్స్ సైతం సినిమా సూపర్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఆస్కార్ విన్నర్ దర్శక ధీరుడు రాజమౌళి(Ss Rajamouli)ధురంధర్ 2 గురించి ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. మరి రాజమౌళి రివ్యూలో ఏముందో చూద్దాం.

నాకు ధురందర్ 1 చాలా నచ్చింది, కానీ పార్ట్ 2 పరిమాణంలోను, ఆత్మలోను పార్ట్ 1 ని మించిపోయింది. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం,సన్నివేశాల  రూపకల్పన, దర్శకత్వం అన్నీ ఎలాంటి కల్మషం లేనివిగా కుదిరాయి. కానీ భావోద్వేగభరితమైన అంశాలు మూవీకి అసలైన ఆధారాన్ని ఇచ్చాయి. నిజమైన ఉత్కంఠని  సృష్టించేలా కథలో మలుపులని కూడా అద్భుతంగా అల్లింది. ఆదిత్య ధర్ గారు దర్శకుడిగా  అదరగొట్టారు. 4 గంటల నిడివితో రిలీజ్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటిది మూవీ చూస్తున్నంత సేపు ఫస్ట్ ఫ్రేమ్ టూ చివరి ఫ్రేమ్ వరకు సీట్లకి అతుక్కుపోతాం. స్నేహితుడు రణవీర్ అద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచాడు. స్టార్టింగ్ లో తన సోదరితో చేసిన సన్నివేశంలో అయితే  మాస్టర్ క్లాస్ పెర్ఫార్మ్. అది మొదలు హార్ట్ ని పిండేసే క్లైమాక్స్ వరకు, హంజా, జస్కిరత్‌గా రణవీర్ మంత్రముగ్ధులని చేసాడు.

Also read:  Dhurandhar 2: ధురంధర్ 2 విసుగు పుట్టించే సినిమా.. మీ డబ్బు వృధా చేసుకోవద్దు

మాధవన్  గారు తన క్యారక్టర్ ద్వారా దేశం యొక్క నిస్సహాయతని, నిరాశని ఎంతో  అద్భుతంగా ప్రదర్శించారని రాజమౌళి తన ఎక్స్ వేదికగా తెలిపాడు. ఇప్పడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తు 'మరి మీరు కూడా 'వారణాసి'(Varanasi)ని ధురంధర్ 2 ని మించే పోయేలా చిత్రీకరించి ఇండియన్ సినిమా కీర్తిని మరోసారి వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద చాటి చెప్పాలనే కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు.

 ?s=20

 


    

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com