
-కమల్, రజినీ ల ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది
-నెల్సన్, అనిరుద్ ఏమంటున్నారు
-రికార్డుల వేట గ్యారంటీ
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి రెస్ట్ అనేది లేకుండా చేయడానికి ముస్తాబవుతున్న కాంబో కమల్ హాసన్(kamal Haasan),రజనీకాంత్(Rajinikanth).అసలు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని అభిమాన మేధావుల ఊహలకి కూడా అందలేదు. దీంతో అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర్నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులతో పాటు ఇండియన్ సినిమా లవర్స్ మొత్తం సోషల్ మీడియా వద్ద తిష్ట వేసుకొని కూర్చుకున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇద్దరి అభిమానులకి పూనకాలు తెప్పిస్తుంది. అంత పూనకాలు తెప్పించేలా గ్లింప్స్ లో ఏముందో చూద్దాం.
సుమారు మూడు నిమిషాల ముపై ఆరు సెకన్ల నిడివితో గ్లింప్స్ ఉండగా రజనీ,కమల్ లు డైరెక్టర్ నెల్సన్ తో 'ఒకరు వాడిన వస్తువులని ఒకరు వాడమని చెప్పి కోటు, షూస్, బెల్ట్, వాచీ, స్పెక్ట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు తమ గదుల్లోని నుంచి బయటకి వచ్చి కోపంగా చూసుకొని స్టైలిస్ట్ గా ఒక కారు మెకానిక్ షెడ్ లో నడుచుకుంటూ వచ్చారు.మరో పక్క ఫారిన్ లేడీస్ కార్ వాష్ చేస్తుండటం స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. ఆ తర్వాత కారు ఎక్కి తమ వెనక ఉన్న నెల్సన్, మ్యూజిక్ ని అందిస్తున్న అనిరుద్ తో హీరో ఎవరని కమల్, రజినీ అడిగారు.
గ్లింప్స్ స్టార్టింగ్ లోనే నెల్సన్(Nelson),అనిరుద్(Anirudh)కనిపించి తమ మాటలతో మెస్మరైజ్ చేసారు.ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ని దక్కించుకునే అవకాశం రెడ్ జయింట్ మూవీస్ ని పొందగా, లెజండ్రీ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ రాజీవ్ మీనన్(Rajeev Menon)ఛాయాగ్రహణ బాధ్యతలు అందిస్తుండటం విశేషం. హీరోయిన్స్ తో పాటు మిగతా నటీనటులు వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.








