బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సిరీస్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే జపాన్‌లో మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి హీరోలకు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే టాలీవుడ్ హీరోలు జపాన్ వెళ్లినపుడు వారికి ఘన స్వాగతం లభిస్తూ ఉంటుంది. అక్కడ మన హీరోలకు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటి ఓ జపాన్ అభిమాని హైదరాబాద్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆ షాపింగ్ మాల్ కోసం ఎన్టీఆర్ చేసిన యాడ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ యాడ్స్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. ఆ యాడ్స్ చూసి ఇన్‌స్పైర్ అయిన జపాన్ అభిమాని భర్తతో కలిసి షాపింగ్ చేసేందుకు హైదరాబాద్‌కి వచ్చారు. ఎన్టీఆర్ యాడ్స్ చూసే ఇక్కడికి వచ్చానని.. తనకు, తన భర్తకు డ్రెస్సులు తీసుకున్నామంటూ చూపించారు. ఇది తన జీవితంలో గొప్ప షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అని ఆమె చెప్పారు. అంతేకాదు, ఆ అభిమాని వాడుతున్న బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్‌లపై కూడా ఎన్టీఆర్ ఫోటోలు ఉండడం విశేషం.








