
మరికొన్ని గంటల్లో యష్ తన వన్ మాన్ షో 'టాక్సిక్' తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ కాబోతున్నాడు. కేజిఎఫ్ సిరీస్ వచ్చిన నాలుగేళ్ళ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ , ప్రేక్షకులు టాక్సిక్ ని వీక్షించడం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా సోషల్ మీడియాలో యష్ ఫ్యూచర్ లో రాజకీయరంగ ప్రవేశం చేస్తాడనే రూమర్ హల్ చల్ చేస్తుంది. ఈ రూమర్ వినిపించడానికి కూడా కారణం ఉంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యశ్ తమిళ స్టార్ హీరో ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ గురించి మాట్లాడుతు 'విజయ్ ప్రయాణం నిజంగా నాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయనలోని క్రమశిక్షణ, ప్రజల పట్ల ఉన్న కట్టుబాటు, విపరీతమైన ప్యాషన్ చూసి ఎంతో నేర్చుకున్నాను. నటుడిగా ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమాభిమానాలని తిరిగి సమాజానికి సేవ రూపంలో అందించే బాధ్యతాయుతమైన ఘట్టానికి విజయ్ చేరుకున్నారు. ప్రజలు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టారంటే దానికి ఆయన పడిన కష్టమే కారణం. కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆయన పయనం మునుముందుకు విజయవంతంగా సాగాలని యశ్ ఆకాంక్షించారు. దీంతో విజయ్ దారిలోనే యష్ రాజకీయాల్లోకి వస్తాడనే రూమర్ చిరు మందహాసంతో షికారు చేస్తుంది. ఏది ఏమైనా యష్ రాజకీయాల్లో రావడం తన సినీ హక్కు.
Also Read: శ్రియ ఇనిస్టాగ్రమ్ పిక్ వైరల్.. ఆ స్టార్ హీరోతో హ్యాపీ డే
Yash, Vijay, Toxic, Geetu Mohandas





