
మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు శివ నిర్వాణ తీసిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఎమోషనల్ థ్రిల్లర్‌గా వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా, శివ నిర్వాణ మేకింగ్ సత్తాను మరోసారి చాటిచెప్పింది ఈ చిత్రం. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సినిమాల తర్వాత 'ఇరుముడి' అందించిన భారీ విజయంతో ఇప్పుడు శివ నిర్వాణ పేరు సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సినిమా చూసిన తర్వాత ఒక సౌత్ స్టార్ ప్రత్యేకంగా స్పందించడమే కాదు.. డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఏకంగా చర్చలు కూడా మొదలుపెట్టేశారు. ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య.
'కరుప్పు', 'విశ్వనాథ్ & సన్స్' సినిమాలతో రెండు వరుస విజయాలను అందుకొని జోష్ లో ఉన్న సూర్య.. శివ నిర్వాణ టాలెంటెడ్ కి ఫిదా అయిపోయారట. 'ఇరుముడి'లో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ శివ నిర్వాణ ఎంత బ్యాలెన్స్ చేశారో చూసి సూర్య ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు, "నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక సాలిడ్ స్ట్రెయిట్ తెలుగు స్క్రిప్ట్ సిద్ధం చెయ్.. కలిసి పనిచేద్దాం" అని సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.
Also Read: కింగ్ 100: ఐడెంటిటీ కోసమే ఇదంతా.. బాలకృష్ణకు పోటీగా నాగార్జున.!
సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆ మార్కెట్ ను మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో 'విశ్వనాథ్ & సన్స్' చేసినప్పటికీ, అది తమిళ్ లోనే తెరకెక్కింది. అయితే ఈసారి మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలోనే శివ నిర్వాణతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
సూర్య లాంటి ఇంటెన్స్ యాక్టర్.. శివ నిర్వాణ లాంటి ఎమోషనల్ డైరెక్టర్ తో జతకడితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు.
[Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Suriya, Telugu Movie, Vishwanath and Sons, Telugu Cinema News, Tollywood, Telugu News]






