Home

»

Gossips

మెగాస్టార్ లీక్ వల్లనే టైటిల్ మారిపోయిందా?

Aug 22, 2026 11:50AM

 


మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి 'కాకా'తో జనవరి 13 న రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ మూవీకి 'కదిరి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రాబోయే కథ కాబట్టి ఆ ఏరియాలోనే  ఉన్న కదిరి సరైన పేరు అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపించాయి. కానీ  టైటిల్ 'కాకా'గా మారిపోయింది. దీంతో 'కదిరి' నుంచి 'కాకా'గా పేరు మారిందా! దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి చేసిన లీక్ కారణమా అనే గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 ఇటీవల జరిగిన ఒక సినీ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ 'బాబీ'తో చేస్తున్న మూవీ 'కదిరి' అనే పేరును బయటకు చెప్పేశారు . సాధారణంగా పెద్ద హీరోలు ఏదైనా వేదికపై ఒక సినిమా టైటిల్‌ను ముందే ప్రస్తావిస్తే, దానికి ఉండే సస్పెన్స్ లేదా హైప్ కొంతవరకు తగ్గిపోతుందని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ స్వయంగా ఈ పేరును రివీల్ చేయడంతో, సోషల్ మీడియాలో 24 గంటల్లోనే ఆ పేరుతో వేలాది మీమ్స్, ట్రెండ్స్ వచ్చేసాయి. దాంతో సర్ ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అయిందని భావించిన దర్శకుడు మరియు నిర్మాతలు, చివరి నిమిషంలో తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని టాక్. దాదాపు 100 శాతం డిఫరెంట్ అప్పీల్ ఉండాలనే ఉద్దేశంతోనే 'కదిరి' స్థానంలో మాస్ అండ్ రా లుక్ ఉన్న 'కాకా' అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల టాక్.


Also Read: 2027 సంక్రాంతి సమరం షురు.. గెలిచేది ఆ సినిమానే అంటున్న ఫ్యాన్స్  

అయితే మరికొందరు విశ్లేషకులు మాత్రం ఈ ప్రచారాన్ని కేవలం ఒక రూమర్ లేదా గాసిప్‌గానే కొట్టిపారేస్తున్నారు. దర్శకుడు కథను మరింత పదును పెట్టే క్రమంలో క్యారెక్టరైజేషన్‌కు 'కాకా' అనే పదమే సరైన న్యాయం చేస్తుందని భావించి ఉండవచ్చని అంటున్నారు. సినిమాలో హీరో పాత్ర యొక్క మాస్ ఆటిట్యూడ్, నటన మరియు డైలాగ్ డెలివరీ ఆధారంగా  మార్పులు చేసి, చివరకు 'కాకా' వైపే మొగ్గు చూపారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, చిరంజీవి లీక్ వల్లనే టైటిల్ మారిందా లేదా కథా అవసరాల రీత్యా మార్చారా అనే విషయం పక్కన పెడితే, కాకా మెగాస్టార్ ఇమేజ్ కి నూటికి నూరు శాతం కరెక్ట్ టైటిల్.

Chiranjeevi, Kaaka, Kadiri, Tollywood

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com