
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత భారతీయ సినిమాలో నటిస్తున్న ఆమె.. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే మరో ఆసక్తికరమైన బాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘ది లంచ్‌బాక్స్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రితేష్ బాత్రా.. సైఫ్ అలీఖాన్‌తో ఓ పీరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా నటించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలు, ఇతర అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సైఫ్ అలీఖాన్ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రియాంక తప్పుకున్నారనే వార్తల నేపథ్యంలో మేకర్స్ మరో నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు కూడా సమాచారం. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్లో చివరకు ఎవరు భాగమవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
.webp)
మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ప్రియాంక చోప్రా భారతీయ ప్రేక్షకుల ముందుకు మరోసారి పెద్ద స్థాయిలో రాబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. రాజమౌళి వంటి దర్శకుడితో కలిసి పనిచేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇది కూడా చదవండి: దొంగ నా కొడుకు టీజర్.. మౌళి మరో హిట్ కొట్టేలా ఉన్నాడు.!
[Priyanka Chopra Exit From Big Project, Priyanka Chopra Upcoming Movies, SS Rajamouli, Mahesh Babu, Varanasi Movie, Priyanka Chopra, Saif Ali Khan, Ritesh Batra, Telugu Film News]





