Home

»

Bollywood News

రణబీర్ కపూర్ ఇంటి వద్ద రెక్కీ: డెడ్ డ్రాప్ ద్వారా తుపాకుల సరఫరా!

Oct 22, 2026 5:10PM


నేను కూడా అయోధ్య రాముడినే అంటూ సెల్యులాయిడ్ పైకి దూసుకొస్తున్నాడు రణబీర్ కపూర్. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి ఫ్యాన్స్, సినీ లవర్స్  లో జోష్ నింపుతున్నాడు. అలాంటి ఈ టైంలో రణబీర్ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్న విజయం తెలిసిందే. ఈ హై ప్రొఫైల్ కేసు దర్యాప్తు మరింత ముందుకు సాగుతున్న కొద్దీ, పోలీసుల విచారణలో విస్మయకరమైన విషయాలు బయటపడుతున్నాయి. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన నిందితులు కేవలం ఆయనపై మాత్రమే కాకుండా, ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ బాంద్రా నివాసంలో కూడా ముందస్తు రెక్కి నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో అధికారిక వర్గాలు వెల్లడించాయి. 


ఇది కూడా చదవండి: అర్థమైందా రాజా: కలెక్షన్ల ఊచకోత.. విజయ్ రికార్డు గల్లంతు!

 

ముంబై పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ నిందితులు రణబీర్ కపూర్ నివాసం చుట్టూ తిరుగుతూ అక్కడ భద్రతా ఏర్పాట్లు, రాకపోకల గురించి పక్కాగా కూపీ లాగారు. ఈ తాజా పరిణామంతో కేవలం టైగర్ ష్రాఫ్ మాత్రమే కాకుండా, బాలీవుడ్‌లోని ఇతర ప్రముఖ నటులు కూడా ఈ ప్రమాదకరమైన క్రిమినల్ సిండికేట్ల టార్గెట్‌లో ఉన్నారా అనే కోణంలో పోలీసులు  దర్యాప్తుని  ముమ్మరం చేశారు. రామాయణ రిలీజ్ వేళ రణబీర్ కపూర్ పేరు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వినిపిస్తుండటం కలకలం రేపుతోంది. 

 

[Ranbir Kapoor residence recce, Lawrence Bishnoi gang, Mumbai police investigation, Anil Pandit, Bollywood news, Tiger Shroff Firing Accused, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com