Home

»

Bollywood News

దలేర్ మెహందీ ఆల్కహాల్ తాగాడా: ఆ లెజండ్రీ ఆరోగ్యంపై అనుపమ్ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Oct 21, 2026 2:54PM

పాట, సంగీతం గురించి తెలియని వాళ్ళు సైతం 'దలేర్ మెహందీ' నోటి నుంచి వచ్చే పాట వింటే చాలు విత్ ఇన్ సెకన్ లో డాన్స్ చేస్తారు.ఇక సంగీత ప్రియులైతే చెప్పక్కర్లేదు, కోటి రూపాయిలు కళ్ళ ముందు కనపడ్డా,దలేర్ కి సరెండర్ అయ్యి ఉంటారు. ఆయన గాత్రానికి, పాటకి అంతటి సమ్మోహన శక్తీ ఉంది. రీసెంట్ గా ఆ లెజండ్రీ  ఉత్తరాఖండ్‌లో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో సింగర్ గా వచ్చారు. కానీ ఒక ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ మంత్రి సుబోధ్ ఉనియాల్ దలేర్ ని అవమానించాడు. ఇప్పుడు ఈ విషయంలో దలేర్ కి లెజండ్రీ బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ అండగా నిలిచారు. ఆ డీటెయిల్స్  ఏంటో చూద్దాం.


ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌లో జరిగిన సిద్ధపీఠ్ మా కుంజాపురి టూరిజం అండ్ డెవలప్‌మెంట్ ఫెయిర్ వేదికపై  దలేర్  ప్రదర్శన ఇస్తున్న సమయంలో మంత్రి అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి దలేర్ ప్రెజెంటేషన్‌ని తప్పుపట్టడమే కాకుండా, ఆల్కాహాల్ సేవించి ప్రదర్శన ఇస్తున్నారంటూ బహిరంగంగా ఆరోపణలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.


ఇది కూడా చదవండి: రామాయణ రెమ్యునరేషన్ వివరాలు ఇవే!

 

 

ఈ ఘటనపై స్పందించిన అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా తన మనోవేదనను పంచుకున్నారు. గత 30-35 సంవత్సరాలుగా తన అద్భుతమైన పాటలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ సంగీత ప్రపంచానికి దలేర్ ఎనలేని సేవలు అందించారు. దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న ఒక కళాకారుడి గౌరవాన్ని ఇలా అందరి ముందూ నిలబెట్టి ప్రశ్నించడం సరైన పద్ధతి కాదు. మంత్రికి ప్రదర్శనపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే లేదా అసంతృప్తి ఉంటే, దానిని పక్కకు పిలిచి ఎంతో గౌరవప్రదంగా చెప్పవచ్చు కానీ, ఇలా అందరి ముందూ అవమానించడం ఎంతవరకు సమంజసం. గత రెండు, మూడు సంవత్సరాలుగా దలేర్  ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సరిగ్గా ఆరోగ్యం లేకపోయినా తన ట్రూప్ తో కలిసి ప్రేక్షకులని అలరించేందుకు  నిరంతరం శ్రమిస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు ఎంతో కాలం నుంచి  పరిచయం. ఎప్పుడూ ఆల్కహాల్ ముట్టుకోలేదు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి ఈ స్థాయిలో అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావడం  తీవ్రంగా కలచివేసిందని అనుపమ్ ఖేర్  ఆవేదన వ్యక్తం చేశారు. 

 

[Anupam Kher ABout Daler Mehndi, Daler Mehndi Issue, Anupam Kher, Daler Mehndi, Uttarakhand Minister, Subodh Uniyal, Mika Singh, Bollywood News, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com