Home

»

Bollywood News

సన్నీలియోన్ కి ముంబై కోర్టు శుభవార్త.. ఫ్యాన్స్ లో జోష్ 

Aug 27, 2026 6:04PM

 


 హీరోయిన్స్ లో ఇండియా వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించిన వాళ్లలో సన్నీ లియోన్ ఒకరు. స్టిల్ ఈ టైంలో కూడా యూట్యూబ్ లో  సన్నీలియోన్  వీడియోస్ చూసే అభిమానులకి లెక్కే లేదు. అసలు 'స' అంటేనే సన్నీలియోన్ అనేలా తన హవా కొనసాగిన రోజులు కూడా ఉన్నాయి.రీసెంట్ గా సన్నీ లియోన్ కి ఆమె భర్త డానియెల్ వెబర్,వారి మేనేజర్  రజానీలకు ముంబైలోని దిండోషి అదనపు సెషన్స్ కోర్టులో భారీ ఊరట లభించింది.

 ఒక తెలుగు సినిమా ఆఫర్ లావాదేవీల విషయంలో దాఖలైన 70 లక్షలకు పైగా కమీషన్ బకాయిల మోసం కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసింది. టాలెంట్ కోఆర్డినేటర్ ఓం ప్రకాశ్ శ్రీనారాయణ్ జైన్ దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జి పీఏ సానే, ఈ వివాదం కేవలం సివిల్ మరియు వ్యాపారపరమైన ఒప్పందానికి సంబంధించినదని, ఇందులో ఎలాంటి క్రిమినల్ కోణం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం గతంలో  సన్నీ లియోన్ నటించిన ఒక తెలుగు చిత్రానికి సంబంధించిన లావాదేవీలతో మొదలైంది. ఫిర్యాదుదారుడైన ఓం ప్రకాశ్ జైన్ కథనం ప్రకారం, ఆ సినిమా కోసం సన్నీ లియోన్ కి  1.75 కోట్ల రూపాయల మేర రెమ్యూనరేషన్ ఒప్పందం కుదిరింది. ఆ మొత్తంలో తనకు 10 శాతం కమిషన్ చెల్లించేలా అంగీకారం కుదిరిందని, సన్నిలియోన్ కి  తొలి విడతగా 35 లక్షలు అందగా 1.75 లక్షలు మాత్రమే కమిషన్ ఇచ్చారు. ఆ తర్వాత జూలై 20, 2022న మరో. 3.50 లక్షల మొత్తం చెల్లించారని, అయితే చివరి విడతగా నటికి అందిన  70 లక్షల బకాయిల నుండి తనకి రావాల్సిన కమిషన్ మరియు 10 శాతం ఇన్సెంటివ్‌ను ఇవ్వకుండా నమ్మకద్రోహానికి పాల్పడ్డారని జైన్  కోర్టుని  ఆశ్రయించాడు.

ఈ కేసుని పరిశీలించిన అందేరి మేజిస్ట్రేట్ కోర్టు, 2024 అక్టోబర్ 10న జైన్ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును తిరస్కరించింది. జైన్ దీనిని సవాలు చేస్తూ దిండోషి అదనపు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. సన్నీ లియోన్ దంపతుల తరఫు న్యాయవాది రాజ్‌కుమార్ మిశ్రా వాదనలు వినిపిస్తూ, ఇది పూర్తిగా రెండు వర్గాల మధ్య జరిగిన వ్యాపార ఒప్పందమని, ఆరంభం నుంచీ మోసం చేసే ఉద్దేశం తమ క్లయింట్‌కు లేదని వివరించారు. కేసులో సమర్పించిన ట్యాక్స్ ఇన్వాయిస్‌లు, ఫారమ్ 16-ఏ కాపీలు మరియు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం, ఇది సాధారణ వాణిజ్య లావాదేవీ అని నిర్ధారించింది.


Also Read: స్టార్ హీరోల ఫ్యాన్స్‌కి నిరాశ.. టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల రచ్చ


ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించలేక పోవడం లేదా చెల్లింపుల్లో వ్యత్యాసాలు రావడమనేది కేవలం ఒప్పంద ఉల్లంఘన (బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్) మాత్రమే అవుతుందని, దానికి మోసం (Cheating) లేదా క్రిమినల్ నమ్మకద్రోహం (Criminal Breach of Trust) వంటి రంగులు పులమలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భార‌తీయ న్యాయ సంహిత లేదా ఐపీసీ సెక్షన్ 406, 420, 506(II) కింద నేరం నిరూపితమయ్యే ఆధారాలు లేవని పేర్కొంటూ, మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను అదనపు సెషన్స్ కోర్టు సమర్థించింది. దీనితో సన్నీ లియోన్, డానియెల్ వెబర్ దంపతులకు ఈ కేసు నుంచి  విముక్తి లభించింది. 

Sunny leone, Daniel Weber, Tollywood, TeluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom, Bollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com