Home

»

Bollywood News

ప్రముఖ సింగర్ దారుణహత్య

Aug 27, 2026 3:27PM

 

ప్రముఖ హర్యానా జానపద గాయకుడు, ప్రసిద్ధ యూట్యూబర్  అంకిత్ బాలియాన్ దారుణ హత్యకి గురయ్యాడు. రోజూలాగే  ఆర్యాపురి వద్ద ఉన్న ఫిట్‌నెస్ జిమ్‌లో వర్కౌట్ పూర్తి చేసుకుని, సాయంత్రం 6:55 గంటల సమయంలో బయటకు వచ్చి తన ఎస్‌యూవీ (SUV) వైపు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చి కాపుకాసిన నలుగురు అజ్ఞాత దుండగులు ఒక్కసారిగా ఆయన వాహనం తలుపులు తెరిచి తుపాకీతో కాల్పుల వర్షం కురిపించారు.

 దుండగులు దాదాపు 18 రౌండ్ల పాటు కాల్పులు జరపగా, అంకిత్ శరీరంలోకి 5 బుల్లెట్లు నేరుగా దిగిపోయాయి. దీంతో ఆయన అక్కడికక్కడే తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్న పోలీసులు ఆయనను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినప్పటికీ, ఆలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.  ఈ ఘోర ఉదంతంలో అత్యంత విషాదకరమైన మరియు విస్తుపోయే విషయం ఏమిటంటే, అంకిత్ హత్యకు గురైన తీరు ఆయన రూపొందించిన పాటలని, సోషల్ మీడియా పోస్టులని అచ్చుగుద్దినట్లు పోలి ఉండటం. ఆయన గతంలో పాడిన "భారీ కోర్టులో నిన్ను కాలుస్తాం నా ప్రాణమా" అనే హిట్ పాట మరియు హత్యకు కేవలం ఒక గంట ముందు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన "రోడ్డుపై హత్య చేస్తాం" అనే లిరిక్స్ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన నిజ జీవితంలో భయానక రీతిలో ఆ నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. యూట్యూబ్‌లో 3.66 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న అంకిత్, తన పాటలలో గన్ కల్చర్, దేశీ యాటిట్యూడ్, గ్రామీణ నేపథ్యాలను చూపిస్తూ యువతలో విశేష ప్రజాదరణ పొందారు.

Also Read: ఆ వ్యక్తితో చెప్పులు మోయించిన హీరోయిన్ రెజీనా.. వైరల్ వీడియోపై విమర్శల జోరు

ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఢిల్లీకి చెందిన ప్రముఖ 'గోగి గ్యాంగ్' ఈ హత్యకి తామే బాధ్యులమని ప్రకటించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ లోని శ్యామ్లీ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకోగా  అంకిత్ వయసు 32 సంవత్సరాలు. 

 Ankit Balyan, Haryanvi Singer, Bollywood,Tollywood, TeluguCinema, TeluguNews TeluguCinemaNews , TeluguOneDotCom 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com