
హీరో కట్ అవుట్ తో సంబంధం ఉన్నా, లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తుందనే మాటని మరోసారి నిజం చేస్తూ భక్తి రస చిత్రం 'హనుమాన్ అంశ్' కలెక్షన్స్ తుపాన్ సృష్టించే పనిలో చాలా సిన్సియర్ గా ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలి బాబా' నిజజీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కగా థియేటర్ నుంచి బయటకి వెళ్ళాక కూడా ప్రేక్షకుల హార్ట్స్ నుంచి మాత్రం వెళ్లడం లేదు.
ఆగష్టు 7న రిలీజై మొదటి రోజు కేవలం 10 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా మొదటి వారం ముగిసేసరికి 1.08 కోట్లు, రెండో వారం 40 లక్షలతో తొలి రెండు వారాల్లో కలిపి కేవలం . 1.48 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే నమోదు చేయడంతో ఈ సినిమా థియేటర్ల నుంచి త్వరగానే వెళ్లిపోతుందని అందరూ భావించారు. అయితే అసలు మేజిక్ మూడో వారం నుంచి ప్రారంభమైంది. మూవీలో విషయం ఉందనే టాక్ రావడంతో దైవికమైన కంటెంట్, గుండెలను హత్తుకునే కథనంతో మూడో వారంలో బాక్సాఫీస్ లెక్కలు అనూహ్యంగా మారిపోయాయి. ఏకంగా 2150 శాతానికి పైగా వసూళ్ల వృద్ధిని నమోదు చేస్తూ, మూడో వారంలోనే దాదాపు 10.40 కోట్ల కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది.
Also read: ఊహించని సంఘటన: సొంత స్టేట్ కర్ణాటకలో యష్ కి భారీ షాక్
దీంతో థియేటర్ల సంఖ్య పెరగడంతో నాలుగో వారానికి వచ్చేసరికి 5,300 కంటే ఎక్కువ షోలకు విస్తరించడం ఒక అరుదైన రికార్డు. నాలుగో వారాంతంలో శుక్రవారం . 6.25 కోట్లు, శనివారం 9.25 కోట్లు రాబట్టగా, 24వ రోజు ఒక్క రోజే ఏకంగా 12.75 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. ఈ విధంగా కేవలం 24 రోజుల్లోనే భారతదేశంలో 40.13 కోట్ల నెట్ వసూళ్లు, 47.33 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఈ చిత్రం తన బడ్జెట్ కన్నా 20 రెట్లకు పైగా ఆదాయాన్ని సొంతం చేసుకుంది. స్టార్ కాస్ట్ కంటే బలమైన కథ, దైవత్వం, ప్రేక్షకాదరణ ఉంటే చిన్న సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో 'హనుమాన్ అంశ్' రుజువు చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు, గ్లోబల్ స్టార్స్, రూ. 100 కోట్ల ప్రమోషన్లు ఉన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న ఈ రోజుల్లో, ఒక చిన్న భక్తిరస చిత్రం సరికొత్త చరిత్రను తిరగరాస్తోంది. సినిమా బడ్జెట్ కేవలం రెండు కోట్లు.
[Hanuman Ansh, Collections, Neem Karoli Baba Biopic, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]






