Home

»

Bollywood News

అక్టోబర్ 28 కల్లా దేశం విడిచి వెళ్ళిపోవాలి: అమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కి పోలీసుల నోటీసులు!

Oct 15, 2026 12:53PM


భారతీయ చిత్ర పరిశమ్ర గర్వించదగ్గ లెజండ్రీ యాక్టర్ అమీర్ ఖాన్.. అయన మేనల్లుడు ప్రముఖ నటుడు ఇమ్రాన్ ఖాన్. 1988 లోనే చైల్డ్ ఆర్టిస్గ్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఈ ఏడాది సైఫ్ అలీ ఖాన్ హీరోగా వచ్చిన హ్యాపీ పటేల్, ఖతర్నాక్ జాసూస్ లో క్యామియో రోల్ లో కనిపించాడు.

 ఇమ్రాన్ ఖాన్‌కి  ముంబై పోలీసులు సంచలన నోటీసులు జారీ చేశారు. విదేశీ పౌరసత్వ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో, అక్టోబర్ 28 నాటికి భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆ నోటీసులలో స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామం ఒక్కసారిగా బాలీవుడ్ వర్గాల్లోనూ, రాజకీయ వాతావరణంలోనూ తీవ్ర కలకలం రేపింది.కొద్ది రోజుల క్రితం ముంబైలోని చారిత్రాత్మక ఆగస్ట్ క్రాంతి మైదాన్ వేదికగా జరిగిన ఒక ఉద్రిక్త నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో కేవలం ఇమ్రాన్ ఖాన్ మాత్రమే కాకుండా, సుమారు 400 మందికి పైగా నిరసనకారులు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. శాంతియుతంగా సాగుతున్న ఈ ఆందోళనల సమయంలో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.   అయితే, ఈ అరెస్ట్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఇది కూడా చదవండి: ఈ రోజు సాయి దుర్గా తేజ్ పుట్టిన రోజు: అదిరిపోయే కొత్త సినిమా ప్రకటన! 

 

 


పోలీస్ వ్యాన్‌లో కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ "నేను డ్రైవ్‌కు వెళ్తున్నట్లుంది" అంటూ వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాను ఎలాంటి ప్రత్యేక డిమాండ్లతో రాలేదని, ఒక సాధారణ నగర పౌరుడిగా స్వేచ్ఛా సంచారానికి ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారో తెలుసుకునేందుకే అక్కడకు వచ్చానని ఆయన మీడియా ముందు స్పష్టం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆయన్ను పోలీసులు విడుదల చేసినప్పటికీ, అసలు సమస్య ఆ తర్వాతే ప్రారంభమైంది.   విచారణలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ వద్ద పూర్తి స్థాయి భారతీయ పౌరసత్వం లేదని, ఆయన అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉంటూ కేవలం ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్‌పై మాత్రమే భారతదేశంలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారతీయ పౌరుడు కానటువంటి విదేశీ వ్యక్తి దేశంలో జరిగే రాజకీయ నిరసనలు, ఆందోళనలు లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం వీసా నిబంధనలు మరియు ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరమని  తీవ్రంగా ఆక్షేపించారు.

 

[Imran Khan Leave India Notice, Imran Khan, Mumbai Police, Bollywood Actor, Leave India Notice, August Kranti Maidan, OCI Card, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com