బాలీవుడ్లో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది భారతీయ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. వారి పౌరసత్వం మాత్రం ఇతర దేశాలకు చెందినది. కొందరు విదేశాల్లో జన్మించగా, మరికొందరికి తల్లిదండ్రుల ద్వారా విదేశీ పౌరసత్వం లభించింది. తమ నటనతో భారతీయ ప్రేక్షకులకు దగ్గరైన ఈ సెలబ్రిటీల జాతీయత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి ప్రముఖుల్లో అలియా భట్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి పేర్లు ఉన్నాయి.
అలియా భట్ ముంబైలో జన్మించినప్పటికీ, ఆమె తల్లి సోనీ రజ్దాన్ ద్వారా బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ‘హైవే’, ‘రాజీ’, ‘గల్లీ బాయ్’, ‘గంగూబాయి కతియావాడి’, ‘జిగ్రా’ వంటి సినిమాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కత్రినా కైఫ్ హాంకాంగ్‌లో జన్మించారు. ఆమె బ్రిటిష్ పౌరురాలు. ‘నమస్తే లండన్’, ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘టైగర్ 3’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
ఇక నోరా ఫతేహి కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారు. తన డ్యాన్స్‌తో పాటు సినిమాల్లో ప్రత్యేక పాటల ద్వారా భారతీయ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంక పౌరురాలు. బహ్రెయిన్‌లో జన్మించిన ఆమె ‘మర్డర్ 2’, ‘హౌస్‌ఫుల్ 2’, ‘కిక్’ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. మరోవైపు, అమెరికాలో జన్మించిన ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. ‘జానే తూ.. యా జానే నా’, ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’, ‘ఢిల్లీ బెల్లీ’ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు.
సన్నీ లియోన్ కూడా విదేశీ పౌరసత్వం కలిగిన ప్రముఖుల్లో ఒకరు. ఆమెకు కెనడా, అమెరికా పౌరసత్వాలు ఉన్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వీరంతా భారతీయ చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే భారతీయ సినిమాల్లో పనిచేయడం, ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ పొందడం వేరు.. ఒక దేశ పౌరసత్వం కలిగి ఉండటం వేరు. ఈ తేడా కారణంగానే విదేశీ పౌరసత్వం ఉన్న బాలీవుడ్ ప్రముఖుల గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది.
[Alia Bhatt Citizenship, Katrina Kaif Nationality, Bollywood Stars Foreign Citizenship, Nora Fatehi Citizenship, Jacqueline Fernandez Nationality, Imran Khan American Citizenship, Sunny Leone Citizenship]





