Home

»

Bollywood News

గాల్లో పల్టీలు కొట్టిన కారు.. 'గ‌న్‌మాస్ట‌ర్ G9' షూటింగ్‌లో బాలీవుడ్ హీరోకి ప్ర‌మాదం.!

Oct 14, 2026 6:25PM

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీకి సినిమా షూటింగ్‌లో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ మూవీ ‘గన్‌మాస్టర్ G9’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యాక్షన్ స్టంట్‌లో భాగంగా గాల్లో వేలాడదీసిన కారు అదుపుతప్పి కింద పార్క్ చేసిన వ్యాన్‌పై పడింది. ఆ సమయంలో ఇమ్రాన్ హష్మీ ఆ కారుకు అత్యంత సమీపంలో ఉండటంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇమ్రాన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన ప్రతినిధి స్పష్టం చేశారు.

మరోవైపు ఈ సినిమా నుంచి తాజాగా ‘దో దిన్ కీ జిందగీ’ అనే మెలోడీ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇమ్రాన్ హష్మీ, జెనీలియా దేశ్‌ముఖ్‌పై చిత్రీకరించిన ఈ పాటకు హిమేశ్ రేషమియా సంగీతం అందించారు. శ్రేయా ఘోషల్, విశాల్ మిశ్రా తమ గాత్రంతో పాటను ఆలపించగా.. జునైద్ వాసి సాహిత్యం అందించారు. ప్రేమ, భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. ఇమ్రాన్ హష్మీ, హిమేశ్ రేషమియా కాంబినేషన్‌లో గతంలో వచ్చిన పాటలను గుర్తుచేస్తూ ఈ కొత్త మెలోడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆదిత్య దత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గన్‌మాస్టర్ G9’లో ఇమ్రాన్ హష్మీ, జెనీలియాతో పాటు అపారశక్తి ఖురానా, అవనీత్ కౌర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, రొమాన్స్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

 

 

[Emraan Hashmi, Gunmaaster G9, Emraan Hashmi Accident, Do Din Ki Zindagi Song, Genelia Deshmukh, Himesh Reshammiya, Shreya Ghoshal, Vishal Mishra, Gunmaaster G9 Release Date]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com