Home

»

Bollywood News

అమ్మవారి పేరు: దీపికా రెండో కూతురికి ఎంత అందమైన పేరు పెట్టారో.!

Oct 21, 2026 12:27PM

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ రెండో కుమార్తె పేరును అధికారికంగా ప్రకటించారు. విజయదశమి సందర్భంగా ఈ దంపతులు తమ కుటుంబానికి సంబంధించిన ఓ అందమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిన్నారి పేరును వెల్లడించారు. ఇంతకీ ఆ పేరు ఏంటంటే.. దేవీ పదుకొణె సింగ్.

దీపికా, రణ్‌వీర్‌ షేర్ చేసిన ఫొటో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ దంపతులు.. తమ చిన్న కుమార్తె దేవీని ఎత్తుకొని ఎంతో సంతోషంగా కనిపించారు. ఇక పెద్ద కుమార్తె దువా తన చెల్లెలికి ముద్దు పెడుతున్న దృశ్యం ఈ ఫొటోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోతోనే తమ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన చిన్నారిని అభిమానులకు పరిచయం చేశారు.

ఈ సందర్భంగా దీపికా, రణ్‌వీర్‌ “Of Love & Abundance…” అనే క్యాప్షన్‌తో పాటు దేవీ పేరును ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో పేర్కొన్నారు. చిన్నారి పేరు ప్రకటించిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

దీపికా, రణ్‌వీర్‌ తమ మొదటి కుమార్తెకు దువా పదుకొణె సింగ్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 2024 సెప్టెంబర్‌ 8న జన్మించిన దువా పేరును అదే ఏడాది నవంబర్‌లో వెల్లడించారు. ‘దువా’ అంటే ప్రార్థన అని దీపికా గతంలో వివరించారు. ఇప్పుడు రెండో కుమార్తెకు ‘దేవీ’ అనే పేరు పెట్టడంతో ఈ రెండు పేర్లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘దేవీ’ అని అమ్మవారి పేరు పెట్టడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

దీపికా, రణ్‌వీర్‌ ప్రేమకథ విషయానికి వస్తే.. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్‌లీలా సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2018 నవంబర్‌లో ఇటలీలోని లేక్‌ కోమో వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

ఇక 2026 సెప్టెంబర్‌ 19న వీరికి రెండో కుమార్తె జన్మించింది. అప్పట్లో చిన్నారి పుట్టిన విషయాన్ని ప్రకటించిన ఈ దంపతులు.. తాజాగా విజయదశమి సందర్భంగా ఆమె పేరును వెల్లడించారు. మరోవైపు దీపికా ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన రాకా చిత్రంలో నటిస్తోంది.

ఇది కూడా చదవండి: రాజమౌళి మామూలోడు కాదు.. ఆరేడు సినిమాలు కలిపి ఒకే సినిమాగా వారణాసి.!

 

 

 

[Deepika Padukone Second Daughter Name, Deepika Ranveer Second Daughter, Devi Padukone Singh, Dua Padukone Singh, Deepika Padukone, Ranveer Singh, Allu Arjun, Raaka Movie, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com