Home

»

Bollywood News

కృతి సనన్‌కు కూడా అదే సమస్య: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ బ్యూటీ.!

Oct 16, 2026 4:00PM

సినిమా నటీనటుల ఫొటోలు, వీడియోలు, పేర్లను సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఉపయోగించడం.. ఏఐతో ఫేక్ వీడియోలు సృష్టించడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ వ్యక్తిగత గుర్తింపును కాపాడుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి కృతి సనన్ కూడా చేరారు. తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కృతి సనన్ తన పేరు, ముఖం, ఫొటోలు, వీడియోలు, గొంతు వంటి వ్యక్తిగత గుర్తింపులను తన అనుమతి లేకుండా ఉపయోగించకుండా రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యంగా తన గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం, అనధికారికంగా ప్రచారం చేయడం వంటి అంశాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి ప్రకటనలు చేయడం.. ఏఐ టెక్నాలజీతో వారి ముఖాలు, గొంతులను అనుకరించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో తమ వ్యక్తిగత గుర్తింపుపై నియంత్రణ కోల్పోతున్నామనే ఆందోళన పలువురు నటీనటుల్లో కనిపిస్తోంది. కృతి సనన్ కూడా ఇదే నేపథ్యంలో తన హక్కులకు చట్టపరమైన రక్షణ కోరినట్లు సమాచారం. ఈ కేసులో సమగ్ర వివరాలను పరిశీలించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: కుంభకు మహేష్ బాబు బర్త్ డే విషెస్.!

 

 

[Kriti Sanon Personality Rights Protection, Kriti Sanon, Personality Rights, Delhi High Court, Kriti Sanon News, AI Deepfake, Celebrity Rights, Bollywood News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com