English | Telugu
తమ్ముడు మనోజ్‌తో గొడవపై విష్ణు ఏమన్నాడు?
Updated : Aug 17, 2021
మోహన్‌బాబు కుమారులు విష్ణు, మనోజ్ మధ్య గొడవలున్నాయని కొంత కాలంగా ఇండస్ట్రీలో నలుగుతున్న ప్రచారం. ఇద్దరూ ఒక తండ్రి సంతానమైనా, తల్లులు వేరు. మోహన్‌బాబు మొదటి భార్య కుమారుడు విష్ణు కాగా, చిన్నభార్య కుమారుడు మనోజ్. మొదటి భార్య మృతి చెందిన తర్వాతే ఆమె చెల్లెలు నిర్మలాదేవిని మోహన్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా మనోజ్‌తో గొడవ గురించి విష్ణును నేరుగా అడిగారు కమెడియన్ అలీ.
'అలీతో సరదాగా' కార్యక్రమం నెక్ట్స్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో లేటెస్ట్‌గా విడుదలైంది. ఇందులో గెస్ట్‌గా విష్ణు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో అలీ, "ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను. అది నువ్వే రివీల్ చేయాలి. నీకూ, మనోజ్‌కూ పడటం లేదు, మనోజ్ మీద చాలా కోపంగా ఉంటున్నావని.. ఇలా కొన్ని వచ్చాయ్" అని అడిగారు.
దానికి సీరియస్‌గా "వాళ్లకు ఎందుకు చెప్పాలి సమాధానం?" అని చెప్పిన విష్ణు, వెంటనే లేచి నిల్చొని ఒంటిమీది కోటు విప్పదీశారు. అది చూసి షాకైనట్లు అలీ పోజిచ్చారు. అసలు అలీ ప్రశ్నకు విష్ణు ఏమని చెప్పారు కోటు ఎందుకు విప్పదీశారు అనేది తెలియాలంటే ఆగస్ట్ 23న ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇంతకీ తమ్మునితో గొడవలు ఉన్నాయని విష్ణు వెల్లడించారా, లేదా?