English | Telugu

హాస్పిటల్ బెడ్ నుంచి 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' ఆడిషన్స్‌కు వెళ్లి సెల‌క్ట‌య్యింది!

'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో పాటు ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ వచ్చింది. 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' అంటూ ఇంతకు ముందు చేసిన స్కిట్స్ లో బెస్ట్ స్కిట్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఓ అరగంట ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీనికి కొన్నిరోజులు ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ భాను యాంకరింగ్ చేసింది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి సిరి హనుమంతు యాంకరింగ్ చేసింది. త్వరలో స్రవంతి చొక్కారపు కనిపించనుంది.

స్రవంతి చొక్కారపు గతంలో మల్లెమాల షోలు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో రెండు మూడు కార్యక్రమాలు చేసింది. ఇమ్మాన్యుయేల్ నచ్చాడని చేసిన స్కిట్ ఒకటి హిట్ అయ్యింది. అయితే, 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' చేసే అవకాశం అంత సులభంగా రాలేదని ఆమె ఓ పోస్ట్ పోస్ట్ చేసింది. ఆ కార్యక్రమానికి ఆడిషన్స్ ఇవ్వడానికి పిలిచినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదట. ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి రాసుకొచ్చింది.

"కొన్ని రోజుల క్రితం అనుకోకుండా నా ఆరోగ్యం బాలేదు. కనీసం బెడ్ మీద నుండి లేవలేని పరిస్థితి. నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆ సమయంలో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. 'బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' కోసం ఆడిషన్ కి రావాలని. వాళ్లకి యాంకర్ ని తీసుకోవడం చాలా అర్జెంటు. నా ముందు ఆ రోజు ఉన్న ఆప్షన్లు రెండే... రిస్క్ తీసుకోవడం, లేదంటే అవకాశాన్ని వదిలేయడం. మా ఇంట్లో వాళ్లంతా 'ఈ పరిస్థితిలో ఎందుకులే, వద్దు' అన్నారు. అప్పటికే ఆ నెలలో వచ్చిన అన్ని అవకాశాలు వదిలేసుకున్నా. ఏదైతే అది అయ్యిందని, దేవుడి మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి ఆడిషన్ కి వెళ్లాను.

తీరా అక్కడికి వెళ్ళాక... నాతో పాటూ ఆరుగురు అమ్మాయిలు వచ్చారు. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. 'నేను అనవసరంగా వచ్చాను. కనీసం స్ట్రాంగ్ గా నిలబడలేని పరిస్థితి' అని మనసులో అనుకొని వెళ్లి నిలబడ్డా. ఓ సాంగ్ ప్లే చేశారు. ఏదో రెండు స్టెప్స్ వేశా. మెల్లగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ సక్సెస్ ఫుల్ గా చెప్పేశా. అసలు, ఆ రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు. నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఫుల్లు ఏడవడం మొదలుపెట్టింది. 'మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ?' అని. 'ఏం కాదులే. అంతా మంచే జరుగుతుంది' అన్నాను.

తర్వాత ఇంటికి వెళ్లపోయా. నాకు రాదని రెండు రోజులు బాధపడ్డా. సడన్ గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు. 'ఒకసారి ఆఫీసుకు రండి. సార్ మీతో మాట్లాడతారట' అని. వెళ్లాను. మాట్లాడాను. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. 'మీకు ఈ షో చేయటం ఇష్టమేనా? అని అడిగారు. 'ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు. కానీ, నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్'. మొత్తానికి రిస్క్ తీసుకోవడాన్ని నేను నమ్మాను" అని స్రవంతి చొక్కారపు తెలిపింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.