English | Telugu

మోనిత చావ‌లేదు! దీపపై కోపంతో కార్తీక్‌ను జైలుకు పంపింది!!

దీప నమ్మకమే నిజమైంది. మోనితను ఆమె భర్త కార్తీక్ హత్య చెయ్యలేదన్నాడనేది నూటికి నూరుపాళ్ళు వాస్తవం. అసలు, హత్య జరగనే లేదు. మోనిత మరణించలేదు. దీపపై కోపంతో హత్యకు గురైనట్టు నాటకం ఆడిన మోనిత, కార్తీక్‌ను కటకటాల వెనక్కి పంపింది. ఇవాళ్టి (ఆగస్టు 17) 'కార్తీక దీపం' ఎపిసోడ్ లో మోనితను దర్శకుడు తెరపైకి తీసుకొచ్చాడు. ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అసలు, నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే...

తన భర్తకు బాలేదని జైలులో కార్తీక్ దగ్గర రత్నసీత మందుల చీటీ రాయించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. దానిని తీసుకువెళ్లి ఓ చిన్న ఇంటికి వెళుతుంది. చూస్తే... అందులో మోనిత ఉంటుంది. ఆ ఇంటి గోడలపై 'నా కార్తీక్... నా కార్తీక్' అని రాసి ఉంటుంది. చిన్న మంచం... కుండలో నీళ్లు... ఎర్రంచు నల్లచీరలో మోనిత! మేడమ్ అంటూ రత్నసీత డోర్ తియ్యగానే.... 'వచ్చావా! నా కార్తీక్ ఫోటో తెచ్చావా?' అంటూ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుంది. ఫోనులో కార్తీక్ ఫొటోలను, మందుల చీటిపై కార్తీక్ హ్యాండ్ రైటింగ్ ను ముద్దులు పెట్టుకుంటుంది.

'నిన్ను వదులుకోను కార్తీక్. నీకు శిక్ష పడాలని కాదు, దీపకు బుద్ధి చెప్పాలని నా ప్రయత్నం. ఆ దీపను వదిలిపెట్టను' అని మోనిత అనడంతో కావాలని హత్యనాటకం ఆడిందని స్పష్టమైంది. తర్వాత రత్నసీతకు కొంత డబ్బులు ఇచ్చి 'నువ్వు నా మనిషి అని తెలియకుండా జాగ్రత్తపడు' అని చెబుతుంది.

అంతకు ముందు... దీపను అంజి కలుస్తాడు. హత్యానేరం తనపై వేసుకుంటానని అంటాడు. అందుకు దీప అంగీకరించదు. తర్వాత మోనితకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? అని దీపను అంజి అడుగుతాడు. తనను చంపడానికి డ్రైవర్ దుర్గను తన అత్తారింట్లో చేర్పించగా, చివరకు మోనితకు శత్రువుగా మారి తనను కాపాడాడని దీప చెబుతుంది. అతడి గురించి ఆరా తీస్తానని అంజి అంటాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.