English | Telugu
తమన్నా 'మాస్టర్ చెఫ్'కు టైమ్ ఫిక్స్ చేశారు!
Updated : Aug 16, 2021
మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'మాస్టర్ చెఫ్'. బహుశా, టీవీ తెర మీద తొలిసారి కుకింగ్ షో హోస్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా అనుకోవచ్చు. ప్రజెంట్ ఆహా ఓటీటీ కోసం లక్ష్మీ మంచు 'ఆహా భోజనంబు' చేస్తున్నారు. అది పక్కన పెడితే... తమన్నా షోకు టెలికాస్ట్ టైమింగ్స్ ఫిక్స్ చేసింది జెమిని టీవీ.
ఆగస్టు 27 నుండి 'మాస్టర్ చెఫ్' కార్యక్రమం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 8.30 గంటలకు బుల్లితెరపై ప్రసారం కానుంది. 'వంటలతో వండర్ చేద్దాం పదండి' అంటోంది జెమిని టీవీ. 'వంటతో వండర్స్ చెయ్యొచ్చని ప్రపంచానికి పరిచయం చేసే గ్రాండ్ గ్రాండ్ కుకింగ్ రియాలిటీ షో. ఇప్పుడు మన తెలుగులో' అంటూ ప్రచార చిత్రాల్లో తమన్నా సందడి చేశారు.
'మాస్టర్ చెఫ్'కు తొలి అతిథిగా అల్లువారి అబ్బాయి, హీరో శిరీష్ వెళ్లారు. ఆల్రెడీ అతడు పాల్గొనగా ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. మరి, తర్వాత ఏ సెలబ్రిటీ వెళతారో చూడాలి. ఆహా భోజనంబులో రకుల్, తరుణ్ భాస్కర్, అలీ సందడి చేశారు.