English | Telugu
నేరాలు కాదు, పాపాలు... నిస్తేజంలో కార్తీక్!
Updated : Aug 16, 2021
'కార్తీక దీపం' సీరియల్‌లో కథ ముందుకు కదలడం లేదు. కానీ, ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌ను కొంత ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తీక్ ఇంకా జైలులో ఉన్నాడు. అతడు మోనితను హత్య చెయ్యలేదని చెప్పడానికి బలమైన ఆధారాలు ఏవీ కనిపించడం లేదు. అలాగని, నేరం చేశాడని రుజువు చేసే సాక్ష్యాలు ఏవీ ఏసీపీ రోషిణి దగ్గర లేవు. దీప పిన్ని భాగ్యం, ప్రియమణి విన్నది చెప్పడం తప్ప కళ్లారా హత్య చెయ్యడం చూసింది లేదు. దాంతో శవం ఆచూకీ కోసం రోషిణి చేసే ప్రయత్నాలు దీపతో మాట్లాడేవరకు వచ్చాయి. అసలు, ఈ రోజు (ఆగస్టు 16, 1119వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది చూస్తే...
జైలులో ఉన్న భర్తను చూడటానికి దీప వెళుతుంది. ఆమెతో కార్తీక్ నిస్తేజంగా మాట్లాడతాడు. మనసు విరిగిపోయిందని అంటాడు. పిల్లల్ని బాగా చూసుకోమని, హంతకుడు పిల్లలని పేరు రాకుండా పిల్లల్ని చూసుకోవాలని, తన తరపున ఒక్క సాక్ష్యం కూడా లేదని కార్తీక్ చెబుతాడు. సరిగ్గా అదే సమయంలో రోషిణి వచ్చి దీపను పిలుస్తుంది.
మోనిత పనిమనిషి ప్రియమణిని ఎంక్వయిరీ చేశానని, ఆమె జరిగిందంతా చెప్పిందనీ, మోనిత శవం ఎక్కడ దాచాడో కార్తీక్ చెబితే శిక్ష తక్కువ పడేలా చేస్తానని దీపతో రోషిణి చెబుతుంది. ప్రియమణిని ఎలా నమ్ముతారని దీప ప్రశ్నిస్తుంది. రోషిణి వినకుండా తనకు బాడీ ఎక్కడ దాచాడో చెప్పమని అడుగుతూ పోతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దీప ఉండదు. వెళ్ళిపోతుంది.
మరోవైపు ఆస్పత్రిలో కార్తీక్ తండ్రి ఆనందరావును డాక్టర్ వర్ధన్ అవమానిస్తాడు. గతంలో తాగి, ఇప్పుడు హత్య చేసి మీ కుమారుడు డాక్టర్ వృత్తికి కళంకం తీసుకొచ్చాడని అంటాడు. ఇంటికి వచ్చి బాధపడుతున్న మామగారితో తన భర్తను రక్షించుకుంటానని దీప శపథం చేస్తుంది. సీన్ కట్ చేస్తే... మళ్ళీ పోలీస్ స్టేషన్ లో తన భర్తకు గుండెజబ్బు వచ్చిందని కానిస్టేబుల్ రత్న సీత మందులు రాయించుకుంటుంది. వాళ్లిద్దరి మధ్య సంభాషణలో 'మీరంటే గౌరవం. మంచివారని విన్నాను. మరి ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. మీరు ఈ నేరం చేసి ఉండరని నాకు అనిపిస్తుంది' అని రత్న సీత అంటుంది. 'నేను నేరాలు చెయ్యలేదు, పాపాలు చేశా. అందుకే, భగవంతుడు ఈ శిక్ష వేశాడు' అని కార్తీక్ అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
photo courtesy: Disney+Hotstar