English | Telugu
అమ్మ నాన్న పవన్ కల్యాణ్.. ఎప్పుడూ మన హృదయంలోనే ఉంటారు!
Updated : Aug 23, 2021
వచ్చే 29వ తేదీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎపిసోడ్ స్పెషల్‌గా ఉండనుంది. టీవీలోని లేడీ స్టార్స్ అందరూ ఈ ఎపిసోడ్‌లో ఆడియెన్స్‌ను అలరించనున్నారు. అంతేకాదు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు, లేడీ అమితాబ్ విజయశాంతికి నీరాజనాలు అర్పిస్తూ ప్రత్యేక స్కిట్‌లతో ఆర్టిస్టులు మన ముందుకు రానున్నారు. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ పవన్ కల్యాణ్ లేడీ ఫ్యాన్స్ ఆయనకు ఈ ఎపిసోడ్‌లో నీరాజనాలు పలికారు.
ఆ ఫ్యాన్స్‌తో ఇంద్రజ, హేమ, సునయన లాంటి తారలు కూడా జత కలిశారు. ఇంకేముంది.. ఆడియెన్స్‌కు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ లభించినట్లే. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమోలో లేడీ స్టార్స్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. ఇంద్రజ అయితే "అమ్మ నాన్న పవన్ కల్యాణ్ ఎప్పుడూ మన హృదయంలోనే ఉంటారు" అని చెప్పిన డైలాగ్‌కు విజిల్స్ మోగిపోయాయి. ఆ డైలాగ్ చెప్పి, స్టైల్‌గా ఆమె కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టడం అలరించింది. 'గబ్బర్‌సింగ్'లో మెడపై చేయిపెట్టి పైకీ కిందకు రాసే పవన్ మేనరిజమ్‌ను లేడీ స్టార్స్ అంతా ఒకేసారి ప్రదర్శించడం కూడా హైలైట్.
ఆ తర్వాత విజయశాంతికి నీరాజనాలు తెలుపుతూ రోహిణి, ఆటో రామ్‌ప్రసాద్ బృందం ప్రదర్శించిన 'ఒసేయ్ రాములమ్మా' ప్రదర్శన అందరికీ కన్నీళ్లు తెప్పించింది. విజయశాంతి రోల్‌లో రోహిణి, రామిరెడ్డి రోల్‌లో రామ్‌ప్రసాద్ అదరగొట్టారు. ఆ ప్రదర్శన అయ్యాక "తెరపై విజయశాంతి లేడీ సూపర్‌స్టార్ అయితే, టీవీపై రోహిణి సూపర్‌స్టార్" అని హైపర్ ఆది కితాబు ఇచ్చేశాడు. నిజంగానే తన నటనతో అందరి హృదయాలనూ ద్రవింపజేసింది రోహిణి. ప్రోమోనే ఇంతగా ఆకట్టుకుందంటే, వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజిలో ఆడియెన్స్‌ను ఖుష్ చేస్తుందో చూడాలి.