English | Telugu
హీరోయిన్‌తో షణ్ముఖ్ చిందులతో చిల్
Updated : Mar 17, 2022
బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సిరితో అతి చేష్టల కారణంగా అడుగు దూరంగా విన్నర్ కావాల్సిన తను రన్నర్ గా మిగిలిపోయాడు. సిరి తల్లి, షన్ను తల్లి చెప్పినా అవన్నీ పట్టించుకోకుండా సిరితో షన్ను చేసిన అతి కారణంగానే తనపై నెగిటివిటీ పెరిగిపోయింది. అది తెలిసి కూడా షన్నులో మార్పు రాకపోవడంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో షన్నుని, సిరిని ఆడేసుకున్నారు. దారుణంగా కామెంట్ లు చేశారు. వీరి ఎపిసోడ్ కారణంగానే షన్నుతో దీప్తి సునయన తన లవ్ కి బ్రేకప్ చేప్పేసి షాకిచ్చింది.
ఆ తరువాత నుంచి దీప్తి ఇచ్చిన షాక్ లోనే వున్న షన్ను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తిరిగి ఎప్పటిలాగే తన యూట్యూబ్ కార్యకలాపాలు మొదలుపెట్టేశాడు. `ఏజెంట్ సూర్య` పేరుతో కొత్త యూట్యూబ్ సిరీస్ కి శ్రీకారం చుట్టాడు. టీవీ షోల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. దీప్తి కూడా తన కవర్ సాంగ్ లతో బిజీగా మారిపోయింది. షన్నుని పట్టించుకోవడం మానేసింది. తను కూడా పార్టీల్లో మునిగితేలుతూ ఫ్రెండ్స్ తో చిల్ అవుతోంది.
Also Read:'శక్తి', 'జంజీర్' సినిమాలపై తారక్, చరణ్ జోకులు
ఇదిలా వుంటే షన్ను కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. తనకు కలిసి వచ్చిన డైరెక్టర్ తో మరో వెబ్ సిరీస్ కి రెడీ అయిపోతున్నాడు. ఇందులో షన్ను ఏజెంట్ సూర్యగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఓ పక్క వెబ్ సిరీస్ చేస్తూనే ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఖుషీగా వున్నాడు షన్ను. తాజాగా హీరోయిన్ సువేక్షతో హీరో విజయ్ నటించిన `బీస్ట్` చిత్రంలోని 'అరబిక్ కుత్తు' పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఫ్యాన్స్ కోసం షేర్ చేయడంతో అది నెట్టింట సందడి చేస్తోంది.