English | Telugu
అభిమన్యు, మాళవిక ప్రతీకారం తీర్చుకుంటారా?
Updated : Mar 16, 2022
బుల్లితెరపై ఆకట్టుకుంటున్న తీసిరయల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. మిన్ను నైనిక, జీడిగుంట శ్రీధర్, బెంగళూరు పద్మ ఇతర పాత్రల్ని పోషించారు. గత కొన్ని వారాల క్రితమే మొదలైన ఈ సీరియల్ బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. కోర్టు ఖుషీ కస్టడీని యష్, వేదలకు అప్పగించడంతో యష్ ఫ్యామిలీ ఆనందంగా గడుపుతుంటారు. ఖుషీని స్కూల్ కి పంపిస్తుంటారు.
ఈ క్రమంలో వేద, యష్ మధ్య గిల్లి కజ్జాలు జరుగుతుంటాయి. పాప షూ పాలీష్ చేయడం కూడా రాదని యష్ ని వేద ఆట పట్టిస్తుంటే అది చూసి ఇంట్లో వాళ్లంతా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీని చూసి సంబరపడుతుంటారు. ఇదే అదనుగా భావించిన వేద .. యష్ ని మరింత గా ఆట పట్టించడం మొదుల పెడుతుంది. దీంతో నాకూ ఛాన్స్ వస్తుంది అప్పుడు చెబుతా నీ సంగతి అని యష్ .. వేదతో అంటుంటాడు...
కట్ చేస్తే .. అవమాన భారంతో ప్రతీకార జ్వాలతో అభిమన్యు, మాళవిక రగిలిపోతుంటారు. మాళీవిక మన పెళ్లెప్పుడని అభిమన్యుని నిలదీస్తుంది. నా ప్రేమను పంచుకోవడమే కాదు.. నా పగని కూడా పంచుకోవాలి. యష్ ని ఓడించిన రోజే మన పెళ్లి అని అభిమన్యు మరోసారి మాళవికతో పెళ్లికి అడ్డంకులు చెబుతాడు. అభిమన్యు చెప్పింది కాదనలేక.. అవుననలేక మాళవిక సైలెంట్ అయిపోతుంది. యష్ ని తిరుగులేని దెబ్బకొడతానని, అది చూసి కుమిలి కుమిలి ఏడుస్తాడని అభిమన్యు అంటాడు. ఇంతకీ అభిమన్యు ప్లాన్ ఏంటీ? ..యష్ అలర్ట్ అవుతాడా? .. అభిమన్యు కుట్రని సమర్ధవంతంగా తిప్పికొడతాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.