English | Telugu
పెళ్లి గురించి అడిగితే వర్షిణి దిమ్మతిరిగే ఆన్సర్
Updated : Mar 17, 2022
యాంకర్ వర్షిణి బుల్లితెకరపై పాపులర్ అయిన విషయం తెలిసిందే. పటాస్ -2, కామెడీ స్టార్స్ షోలకు యాంకర్ గా వ్యవహరించిన వర్షిణి సౌందర రాజన్ `చందమామ కథలు` చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. లవర్స్, బెస్ట్ యాక్టర్స్, శ్రీరామ రక్ష, పెళ్లి గోల - సిరీస్‌లలో నటించింది. `మళ్లీ మొదలైంది` చిత్రంతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించకపోయినా వర్షిణికి మాత్రం చారిత్రక చిత్రం `శాకుంతలం`లో నటించే అవకాశం దక్కింది.
సమంత లీడ్ పాత్రలో నటించగా గుణశేఖర్ ఈ మూవీని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వర్షిణికి మంచి పాత్రే దక్కిందని చెబుతున్నారు. ఇదిలా వుంటే బుల్లితెరపై వర్షిణికి అవకాశాలు దక్కడం లేదు. వెండితెరపై కూడా ఆమెది ఇవే పరిస్థితి. అయితే అవకాశాల కోసం వెతకడం లేదు. సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటూ హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
ఇటీవల బ్లాక్ డ్రెస్ లో వర్షిణి హొయలు పోతూ పోజులిచ్చిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా వుంటే తాజాగా వర్షిణి పెట్టిన పోస్ట్ నెటిజన్‌లని ఆకట్టుకుంటోంది. `26 ఏళ్లు వచ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదా?' అని ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను ఇలా సమాధానం చెబుతానంటూ వర్షిణి పరోక్షంగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 'మనం 2022లోకి వచ్చాం.. అయినా కూడా మన పని మనం చేసుకోకుండా పక్కవారి గురించే ఆలోచిస్తున్నారా?' అని ప్రశ్నిస్తున్నట్టుగా వర్షిణి పోస్ట్ పెట్టడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంటే పెళ్లి గురించి తనని ఎవరూ ప్రశ్నించకూడదని వర్షిణి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చిందని నెటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు.